- ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్
తెలంగాణ వీణ , కొత్తగూడెం : కార్మిక పక్షపాతి పేదల పక్షపాతి దళిత జన బాంధవుడు స్వర్గీయ గడ్డం వెంకట స్వామి( కాకా) అందించిన సేవలు చిరస్మరణీయమని భారతరత్న అంబేద్కర్ సంక్షేమ సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ అన్నారు.
గడ్డం వెంకటస్వామి కుమారులైన ప్రస్తుత శాసనసభ్యులు గడ్డం వినోద్ గడ్డం వివేక్ ల ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న స్వర్గీయ గడ్డం వెంకటస్వామి వర్ధంతి వారోత్సవాల సందర్భంగా మంగళవారం స్థానిక సంఘ కార్యాలయంలో ఏర్పాటు చేసిన గడ్డం వెంకటస్వామి కాకా వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మద్దెలతోపాటు పలువురు మాట్లాడుతూ వెంకటస్వామి సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమానికి ముందుగా వెంకటస్వామి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ ఆత్మీయ వర్ధంతి కార్యక్రమంలో ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్, మాజీ జడ్పిటిసి సభ్యులు రాష్ట్ర మాల మహానాడు నాయకులు గిడ్ల పరంజ్యోతిరావు, జాతీయ సంగీత విద్వాన్ కలవల రాందాస్, చుంచుపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అంతోటి పాల్, ఏజెన్సీ హక్కుల సాధన కమిటీ అధ్యక్షులు బొమ్మెర శ్రీనివాస్, ప్రముఖ గాయకులు సింగర్ ఆఫ్ సింగరేణి అల్లి శంకర్, సినీ నటులు చిత్రపురి సొసైటీ సభ్యులు తాండూర్ ధనరాజ్, సంఘ జిల్లా ఆర్గనైజర్ స్టీవెన్ లాజరస్ రాజు తదితరులు పాల్గొన్నారు.