గత బి.ఆర్.ఎస్ ప్రభుత్వ పదేండ్ల పాలనలో రైతుల పండించిన వరి పంట క్వింటాకు 10 కేజీల చొప్పున కట్టింగులతో ప్రజలను మోసం చేసింది
నూతన కాంగ్రెస్ ప్రభుత్వంలో కట్టింగ్ లను ఎండగడుతూ రైతుల ధాన్యన్ని తక్షణమే సరఫరా చేస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలు…
కాంగ్రెస్ ప్రభుత్వం తరుగు లేకుండా ధాన్యన్ని కొనుగోలు చేయడం
రైతుల పట్ల నడుచుకుంటూన్న విధివిధానాల వైఖరి పట్ల హర్షం వ్యక్తం చేస్తున్న రైతన్నలు…
తెలంగాణ వీణ, ములుగు : ఏఐసీసీ మహిళ ప్రధాన కార్యదర్శి తెలంగాణ రాష్ట్ర పంచాయితీ రాజ్ శాఖ & స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి సీతక్క గారి ఆదేశాల మేరకు, జిల్లా అధ్యక్షులు పైడకుల అశోక్,నియోజకవర్గ కోర్డినేటర్ ఇర్శవడ్ల వెంకన్న, జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఎండీ అయుబ్ ఖాన్ గారి సూచనల మేరకు కాంగ్రెస్ మండల అధ్యక్షులు చిటమట రఘు గారి ఆధ్వర్యంలో ఏటూరునాగారం మండల కేంద్రంలోని PACS, జీసీసీ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను మరియు రైతుల కల్లాలను సందర్శించిన మండల కాంగ్రెస్ నాయకులు.
ఈ సందర్బంగా మండల అధ్యక్షులు చిటమట రఘు గారు మాట్లాడుతూ గత బిఆర్ఎస్ ప్రభుత్వ పదేండ్ల పరిపాలనలో తరుగు పేరుతో రైతులు పండించిన వరి పంటకు క్వింటాకు 10 కేజీల చొప్పున తరుగు పేరుతో దోపిడికి పాల్పడి రైతులను ఇబ్బందులకు గురి చేసినటువంటి ప్రభుత్వం పోయి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే తరువు తీయకుండా వడ్లను కొనుగోలు చేయడం.కట్టింగ్లను ఎండ కడుతూ రైతుల అమ్ముకున్నటువంటి ధాన్యాన్ని తక్షణమే సరఫరా చేస్తున్నందుకు ఆనందాన్ని వ్యక్త పరుస్తూ నూతన కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పట్ల నడుచుకుంటూన్నటువంటి వైఖరి విధానానికి రైతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు ఎండీ ఖలీల్ ఖాన్, జిల్లా కార్యదర్శి గుడ్ల దేవేందర్, జిల్లా అదికార ప్రతినిధి ముక్కెర లాలయ్య, బ్లాక్ ప్రధాన కార్యదర్శి వావిలాల నర్సింగరావు , మండల ప్రధాన కార్యదర్శి వావిలాల ఎల్లయ్య, PACS వైస్ చైర్మన్ చెన్నూరు బాలరాజు, జిల్లా యూత్ కార్యదర్శి ఎండీ గౌస్ పాషా, టౌన్ అద్యక్షులు సులేమాన్, మాజీ టౌన్ అధ్యక్షులు తాల్లపెళ్లి నరేందర్, ఇర్సవడ్ల కిరణ్, యూత్ మండల అధ్యక్షులు గడ్డల నవీన్, టౌన్ ఉపాధ్యక్షులు మామిడి రాంబాబు ,టౌన్ యూత్ అధ్యక్షులు బండారి లక్కీ, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ డోంగిరి మధుబాబు,అల్లంవారి ఘనపురం సర్పంచ్ పలక చిన్నన్న, చల్పాక సర్పంచ్ చింత సుమతీ రమేశ్, సద్దాం, పెయ్యల సమ్మయ్య, జనగాం చెన్నేష్ తదితరులు పాల్గొన్నారు.