తెలంగాణ వీణ , ములుగు : ములుగు జిల్లా కేంద్రంలో ములుగు మండల అధ్యక్షులు ఎండి.చాంద్ పాషా గారి ఆధ్వర్యంలో కిసాన్ కాంగ్రెస్ ముఖ్య నాయకుల సమావేశం ఏర్పాటు చేయగా అట్టి సమావేశానికి ముఖ్య అతిథిగా కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు మరియు ములుగు నియోజకవర్గ కో – ఆర్డినేటర్ గొల్లపెల్లి రాజేందర్ గౌడ్ విచ్చేసి గత పది సంవత్సరాలుగా రైతు పండించిన పంటను తరుగు పేరుతో దోచుకుంటున్న గత ప్రభుత్వాల నియంత పాలన కూల్చి, తరుగు లేకుండా సన్న ధాన్యానికి క్వింటాలుకు 2200/- రూపాయలు చెల్లించేలా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు చేపట్టడం, అధికారంలోకి వచ్చిన నెల రోజులలోపే మన రేవంత్ రెడ్డి మరియు సీతక్క చేసిన కృషికి వారి చిత్ర పటాలకు కాంగ్రెస్ పార్టీ నాయకులు క్షీరాభిషేకం చేయడం జరిగిందని అన్నారు.
ఈ సందర్భంగా రాజేందర్ గౌడ్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో రైతులు పండించిన పంటను అమ్ముకోలెని దీన స్థితిలో ఉన్నారని, క్వాంట పెట్టిన వడ్లను రవాణా చేయడానికి కూడా వాహనాల సమస్య ఉండేదని, వాహనానికి పదివేల రూపాయలు రైతులు చెల్లిస్తేనే రవాణా సౌకర్యం ఉండేదని, అలాగే రైతు పండించిన పంటను తరుగు పేరుతో దళారులు దోచుకునే వారని అన్నారు. రైతు పండించిన పంటను అమ్మలెని స్థితిలో ఉన్న రైతుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు కూడా కాకుండానే తరుగు లేకుండా ధాన్యాన్ని కొనుగోలు చేస్తూ రైతుల పాలిట దైవంలా మారారని అన్నారు. అలాగే గత ప్రభుత్వంలో ధాన్యం అమ్మడానికి తరుగు పేరుతో క్వింటాలుకు 10 కిలోల వరకు దోచుకునేవారని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తరుగు లేకుండా క్వింటాలుకు 2200/- చెల్లిస్తుండగా, అలాగే బయట కూడా 3000/- రూపాయలకు కూడా కొనుగోలు చేస్తుండడం హర్షణీయం అని అన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే రైతుల ప్రధాన సమస్యను తొలగించిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు రేవంత్ రెడ్డి గారికి, మన పంచాయితీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మాత్యులు సీతక్క గారికి ధన్యవాదాలు తెలుపుతూ, కిసాన్ కాంగ్రెస్ తరుపున పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగిందని అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు కునూర్ అశోక్ గౌడ్, జిల్లా అధికార ప్రతినిధి మూసిన పెళ్లి కుమార్ గౌడ్, కిసాన్ కాంగ్రెస్ జిల్లా ప్రచార కార్యదర్శి నూనెటి శ్యాం, మండల కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు వాకిటి రామకృష్ణరెడ్డి, కిసాన్ కాంగ్రెస్ కార్యదర్శి చక్రం రాజు, గ్రామ కమిటీ యూత్ అధ్యక్షుడు కర్నే రతన్, గౌడ సంఘం జిల్లా అధ్యక్షుడు బొడుగ బిక్షపతి గౌడ్, గౌడ సంఘం అధ్యక్షులు జనగాం శ్రీనివాస్, ఉపాధ్యక్షులు వేముల వేణు, గౌడ్ రైతులు పోతిరెడ్డి రాజు, బోళ్ల కనకయ్య, పోతిరెడ్డి సంజీవ, జక్కుల రవి, మైనాల సారయ్య, గంజి కుమార్, వేల్పుల రాజేషు, బొడ్డు రాజు తదితరులు పాల్గొన్నారు.