ప్రజా పాలన లో ఉద్యోగుల పాత్రే కీలకం
ఆదివాసి సంక్షేమసాంస్కృతిక సేవ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సన్మానం కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర పంచాయితీ రాజ్ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు శ్రీమతి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క
తెలంగాణ వీణ , వరంగల్ :మంగళవారం నర్సంపేట లో ములుగు నియోజక వర్గం కొత్త గూడ గంగారాం మండలాల కు చెందిన ఆదివాసి సంక్షేమ సాంస్కృతిక సేవ సంఘం పట్టణ కమిటీ నర్సంపేట ప్రభుత్వ ఉద్యోగులు ఏర్పాటు చేసిన ఆత్మీయ సన్మానం కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర పంచాయితీ రాజ్ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు శ్రీమతి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క
ఈ సందర్భంగా సీతక్క పంచాయితీ రాజ్ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గా బాధ్యతలు చేపట్టి మొదటి సారిగా వచ్చిన సందర్భంగా ఉద్యోగులు ఘనంగా సన్మానించి శాలువా తో సత్కరించారు అనంతరం
మంత్రి సీతక్క మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వం కడుపులో పెట్టుకొని చూసుకుంటుంది నేను మీ ఇంటి ఆడబిడ్డ ను మీరు నన్ను ఆదరించి ఆశీర్వదించి ఎమ్మెల్యే గా మంగళవారం మంత్రిగా పేద ప్రజలకు సేవ చేసే భాగ్యం కల్పించడం జరిగింది కచ్చితంగా ప్రజలు నాపైన పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఈ ప్రాంత అభివృద్ధికి కట్టుబడి పని చేస్తానని నన్ను ఆదరించి ఆశీర్వదించిన ఈ ప్రాంత ప్రజల రుణం తీర్చుకుంటానని ఈ ఆత్మీయ సన్మానం కార్యక్రమం ఏర్పాటు చేసి మిమ్ములందరిని కలిసే అవకాశం కల్పించిన ఆదివాసి సంక్షేమ సాంస్కృతిక సేవ సంఘం నర్సంపేట కి ధన్యవాదాలు తెలుపుతూ ఈ ప్రాంత అభివృద్ధి లో ప్రభుత్వ ఉద్యోగుల పాత్ర ఉంటుందని మంత్రి సీతక్క గారు అన్నారు