పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క
తెలంగాణ వీణ , ములుగు :
జిల్లాలోని మారుమూల ప్రాంతంలో ఉన్న వెనకబడిన మండలాలు కొత్తగూడ, గంగారంల అభివృద్ధికి అంకిత భావంతో పనిచేస్తానని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మంచినీటి సరఫరా, మహిళ శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ(సీతక్క) అన్నారు.మంగళవారం మంత్రి కొత్త గూడ మండలంలో విస్తృతంగా పర్యటించారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్ శశాంక, ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్ , ఐ.టి.డి.ఏ. పీఓ అంకిత్ తో కలిసి 24 మందికి కల్యాణ లక్ష్మీ షాధి.ముబారక్ లబ్ధిదారులకు చెక్ లను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముందుగా ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.రెండు మండలాల్లో త్రాగునీటి కొరత అధికంగా ఉంటుంన్నందున సమస్యపై అధికారులు దృష్టి సారించాలన్నారు. అంగన్వాడి కేంద్ర భవనాలపై మాట్లాడుతూ మరమ్మత్తులు ఉంటే నిధులు మంజూరు చేస్తానని అన్ని వసతులు కల్పించాలన్నారు. రాష్ట్రంలోని 14 వేల పోస్టులు ఖాళీలు ఉన్నట్లు తమ దృష్టిలో ఉందని త్వరలోనే భర్తీ చేస్తామని తెలియజేశారు. అదేవిధంగా అంగన్వాడీల వేతనాల పెంపుకు చర్య తీసుకున్నామన్నారు. అభివృద్ధి పనులలో నాణ్యత ఉండాలని అధికారులకు సూచించారు. నిధులు మంజూరైన చోట త్వరితగతిన పనులు పనులు చేపట్టాలని అధికారులను కోరారు. ప్రజలు బ్యాంక్ అదనపు బ్రాంచి కోరినందున త్వరలోనే చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజాపాలనను అంకిత భావంతో చేపట్టి విజయవంతం చేయాలని అధికారులకు సూచించారు.అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా పాలన కార్యక్రమంపై అధికారులకు అవగాహన పరిచామని , తాసిల్దార్లు ఎంపీడీవోలు 2 టీంలు గా ఏర్పడి పర్యటిస్తాయని ప్రతి రోజు 4 గ్రామాలు చొప్పున కవరేజ్ చేయడం జరుగుతుందన్నారు. కొత్తగూడ మండలం ఆరు రోజుల్లో పూర్తి చేస్తామన్నారు.
ప్రతిరోజు ఉదయం ఎనిమిది గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం రెండు గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు గ్రామపంచాయతీలలో సమావేశాలు నిర్వహిస్తారన్నారు. కార్యక్రమాలను ఒకరోజు ముందుగానే గ్రామపంచాయతీలో ప్రదర్శింప చేస్తామన్నారు.
ఈ కార్యక్రమం పై విస్తృత ప్రచారం చేపడతామని గ్రామ గ్రామాన దండోరా వేయిస్తామన్నారు.
ప్రతి దరఖాస్తుకు రసీదు ఇస్తామని ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ అపోహలకు తావివ్వరాదన్నారు. 28వ తేదీ నుండి జనవరి ఆరవ తేదీ వరకు 8 రోజులపాటు ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించి ప్రతి ఒక్కరి దగ్గర దరఖాస్తు స్వీకరిస్తామని తెలియజేశారు.
ఈ సమీక్ష సమావేశంలో డిడి ట్రైబల్ వెల్ఫేర్ ఎర్రయ్య ఈ ఈ ట్రైబల్ వెల్ఫేర్ హేమలత ఇతర అధికారులు ఎంపీపీలు జడ్పిటిసిలు ఇతర ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.