Tuesday, December 24, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

రెడ్డి కులస్తుల సమస్యల పరిష్కారానికి కృషి

Must read

  • సంఘం అభివృద్ధికి ప్రభుత్వం నుండి సహాయ సహకారాలు
  • పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు
  • సందడిగా రెడ్డి కుల సంఘం వనభోజనాల కార్యక్రమం

తెలంగాణ వీణ , కొత్తగూడెం : రెడ్డి కుల సంఘం అభివృద్ధికి ప్రభుత్వం నుండి సహాయ సహకారాలు అందించేందుకు తనవంతుగా కృషి చేస్తానని పినపాక నియోజకవర్గం ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. మణుగూరులోని తోగ్గుడెంలోని సమ్మక్క- సారక్క ఆలయం వద్ద రెడ్డి కుల సంఘం వారు ఏర్పాటు చేసుకున్న 14వ వనభోజనాల కార్యక్రమంలో పాయం ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెడ్డి కుల సంఘం అభివృద్ధికి ప్రభుత్వం నుండి సహాయ సహకారాలు అందించి కుల సంఘం అభివృద్ధికి తోడ్పడి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో రెడ్డి కుల సంఘం సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమానికి ముందు ముఖ్యఅతిధిగా విచ్చేసిన పాయంకు రెడ్డి కుల సంఘం సభ్యులు ఘన స్వాగతం పలికి ఆయనకు పుష్పగుచ్చం ఇచ్చి అభినందనలు తెలిపారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you