. మేడారం జాతర విజయవంతం చేయాలి
. మేడారం జాతర కు 75 కోట్లు కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వం
. భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా ఏర్పాట్లు చేస్తున్నాం
. మేడారం జాతర పనులను పరిశీలించిన మంత్రి సీతక్క
తెలంగాణ వీణ, ములుగు : తాడ్వాయి మండలం శ్రీ మేడా రం సమ్మక్క సారలమ్మ వన దేవతలను దర్శించుకున్న పంచాయితీ రాజ్& స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ దనసరి అనసూయ సీతక్క
ముందుగా పసర లోని గుండ్ల వాగు బ్రిడ్జిని,దయ్యలవాగు సమీపం లో ఉన్న రోడ్డును
చింతల్ క్రాస్ వద్ద రోడ్డు ను మరియు పార్కింగ్ స్థలాలను
అనంతరం ఉరాట్టం బ్రిడ్జి నీ వాహనాల పార్కింగ్ స్థలాలను
పరిశీలించారు అదే విధంగా
చిలుకల గుట్ట మరియు విఐపి పార్కింగ్ బస్ స్టాండ్ ను పరిశీలించిన మంత్రి వర్యులు సీతక్క
ఈ సందర్భంగా మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా ఏర్పాట్లు చెయ్యడం జరుగుతుంది అని అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించి పనులు వేగవంతం చేసే విధంగా ఉండాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు
ఈ కార్యక్రమంలో మంత్రి గారి వెంట ములుగు ఎస్పీ గౌస్ ఆలం ఐపీఎస్, జిల్లా అదనపు కలెక్టర్ శ్రీజ ఐఎఎస్,డిఎస్పీ రవీందర్,తో వివిధ శాఖల అధికారులు తో పాటు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడా కుల అశోక్ మరియు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర, జిల్లా బ్లాక్ మండల గ్రామ నాయకులు కార్యకర్తలు ప్రజా ప్రతినిధులు తదితరులు ఉన్నారు.