Tuesday, December 24, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

సింగరేణిలో గుర్తింపు ఎన్నికలకు ఏర్పాట్లు రెడీ

Must read

తెలంగాణ వీణ , భద్రాద్రి కొత్తగూడెం : సింగ‌రేణి సంస్థలో గుర్తింపు సంఘం ఎన్నిక‌ల కోసం స‌ర్వం సిద్ధమైంది. ఈ నెల 27వ తేదీన‌ కేంద్ర కార్మిక శాఖ వారి ఆధ్వర్యంలో ర‌హ‌స్య బ్యాలెట్ పద్దతిలో ఈ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. మొత్తం అన్ని ఏరియాల్లో 39,773 మంది ఉద్యోగులు త‌మ ఓటు హ‌క్కును వినియోగించుకోనున్నారు. సింగ‌రేణిలో మొట్టమెదటి సారిగా 09.09.1998న, చివ‌ర‌గా 05.10.2017న గుర్తింపు ఎన్నిక‌లు జ‌రిగాయి. ఇప్పుడు ఏడో ద‌ఫా జ‌రుగుతున్న గుర్తింపు ఎన్నికల ప్రక్రియలో మొత్తం 13 యూనియ‌న్లు ఎన్నిక‌ల్లో పోటీ ప‌డుతున్నాయి.
ఎన్నికల ప్రక్రియ‌కు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. కేంద్ర కార్మిక శాఖ గుర్తించిన విధంగా కంపెనీలోని 11 ఏరియాలలో 84 పోలింగు కేంద్రాల‌ను ఏర్పాటు చేయ‌డం జ‌రిగింది. ఈ ఎన్నికలు సాధారణ ఎన్నికల పద్ధతిలోనే నిర్వహించటం జ‌రుగుతుంది. పోలింగ్ సిబ్బందిని పోలీస్ సిబ్బందిని కౌంటింగ్ సిబ్బందిని ఆరు జిల్లాల కలెక్టర్ల కార్యాలయం వారు ప్రతిపాదించిన రెవెన్యూ ఇతర ప్రభుత్వ శాఖల నుండి నియమించటం జరిగింది. ఈ నెల 23వ తేదీన పోలింగ్ సిబ్బందికి కౌంటింగ్ సిబ్బందికి కొత్తగూడెం రామగుండం మందమర్రి భూపాలపల్లి లలో (రీజియన్ ల వారీగా) శిక్షణ తరగతులు నిర్వహించటం జ‌రిగింది. ఈ శిక్షణా తరగతులను ఆయా జిల్లాలకు సంబందించిన ఆర్.డి.ఒ. స్థాయి అధికారి కేంద్ర కార్మిక శాఖ నుండి రీజినల్ లేబర్ క‌మిష‌న‌ర్‌ (సెంట్రల్), అసిస్టెంట్ లేబర్ క‌మిష‌న‌ర్‌ (సెంట్రల్), అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు, లేబర్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారి (సెంట్రల్) నిర్వహించారు. 27 తేదీన ఎన్నిక‌ల‌ను నిర్వహించేందుకు వీలుగా కేంద్ర కార్మిక శాఖకు సంబంధించిన‌ అధికారులు మొత్తం ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఇక ఆయా జిల్లా కలెక్టర్లు నియమించిన ఆర్.డి.ఒ స్థాయి అధికారులు, తహసీల్దారులు, తగినంత పోలీస్ సిబ్బంది కూడా కంపెనీ వ్యాప్తంగా ఆరు జిల్లాలలో జరుగుచున్న కార్మిక సంఘాల ఎన్నిక‌లు సాఫీగా జ‌రిగేలా చూసేందుకు సంసిద్ధంగా ఉన్నారు. సింగరేణి యాజమాన్యం అంద‌రినీ సమన్వయం చేసుకుంటూ గుర్తింపు ఎన్నిక‌ల నిర్వహణ కోసం అన్ని ఏరియాలలో ఏర్పాట్ల‌ను పూర్తి చేసింది. అన్ని పోలింగ్ కేంద్రాలలో 27న ఉదయం 7 గంటల నుండి ఐదు గంటల వరకు ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సి ఉంది. ప్రతి ఓటరు ఉద్యోగి విధిగా తమ గుర్తింపు కార్డును (ఐడేంటిటీ శాశ్వత తాత్కాలిక) వెంట తీసుకొని ఓటు హక్కు వినియోగించుకోవాలి.
గతంలో 6 దఫాలుగా ఎన్నికలు నిర్వహించిన విధంగానే ఈసారి కూడా శాంతియుత సుహృద్భావ వాతావరణంలో నిర్వహించటానికి గాను కార్మికులు, కార్మిక సంఘాలు, అధికారులు, ప్రభుత్వం పంపిన కేంద్ర కార్మిక శాఖ అధికారులు, రెవెన్యూ, పోలీస్ ప్రెస్ సిబ్బంది అందరూ సహకరించవలసినదిగా యాజమాన్యం విజ్ఞప్తి చేయడం జరిగింది.
పోలింగ్ కేంద్రాలు ఇలా ఉన్నాయి…*
వరుస సంఖ్య ఏరియా పేరు పోలింగ్ కేంద్రాల సంఖ్య ఇలా ఉంది.
కార్పొరేట్ ఏరియా-4, హైదరాబాద్ సింగరేణి భవన్-1 పోలింగ్ కేంద్రాలు, కొత్తగూడెం (రుద్రంపూర్) ఏరియా 06 పోలింగ్ కేంద్రాలు,
ఇల్లందు ఏరియా 03 పోలింగ్ కేంద్రాలు,
మణుగూరు ఏరియా 07 పోలింగ్ కేంద్రాలు,
రామగుండం ఏరియా 1- 11 పోలింగ్ కేంద్రాలు, రామగుండం ఏరియా 2 -06 పోలింగ్ కేంద్రాలు, రామగుండం ఏరియా 3
(అడ్రియాల కలుపుకుని) 06 పోలింగ్ కేంద్రాలు,
భూపాలపల్లి ఏరియా 09 పోలింగ్ కేంద్రాలు,
బెల్లంపల్లి ఏరియా 05 పోలింగ్ కేంద్రాలు,
మందమర్రి ఏరియా 11 పోలింగ్ కేంద్రాలు,
శ్రీరాంపూర్ ఏరియా 15 పోలింగ్ కేంద్రాలు
మొత్తం 84 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది.

సింగరేణిలో గుర్తింపు ఎన్నికలకు ఏర్పాట్లు రెడీ

తెలంగాణ వీణ/భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:
సింగ‌రేణి సంస్థలో గుర్తింపు సంఘం ఎన్నిక‌ల కోసం స‌ర్వం సిద్ధమైంది. ఈ నెల 27వ తేదీన‌ కేంద్ర కార్మిక శాఖ వారి ఆధ్వర్యంలో ర‌హ‌స్య బ్యాలెట్ పద్దతిలో ఈ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. మొత్తం అన్ని ఏరియాల్లో 39,773 మంది ఉద్యోగులు త‌మ ఓటు హ‌క్కును వినియోగించుకోనున్నారు. సింగ‌రేణిలో మొట్టమెదటి సారిగా 09.09.1998న, చివ‌ర‌గా 05.10.2017న గుర్తింపు ఎన్నిక‌లు జ‌రిగాయి. ఇప్పుడు ఏడో ద‌ఫా జ‌రుగుతున్న గుర్తింపు ఎన్నికల ప్రక్రియలో మొత్తం 13 యూనియ‌న్లు ఎన్నిక‌ల్లో పోటీ ప‌డుతున్నాయి.
ఎన్నికల ప్రక్రియ‌కు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. కేంద్ర కార్మిక శాఖ గుర్తించిన విధంగా కంపెనీలోని 11 ఏరియాలలో 84 పోలింగు కేంద్రాల‌ను ఏర్పాటు చేయ‌డం జ‌రిగింది. ఈ ఎన్నికలు సాధారణ ఎన్నికల పద్ధతిలోనే నిర్వహించటం జ‌రుగుతుంది. పోలింగ్ సిబ్బందిని పోలీస్ సిబ్బందిని కౌంటింగ్ సిబ్బందిని ఆరు జిల్లాల కలెక్టర్ల కార్యాలయం వారు ప్రతిపాదించిన రెవెన్యూ ఇతర ప్రభుత్వ శాఖల నుండి నియమించటం జరిగింది. ఈ నెల 23వ తేదీన పోలింగ్ సిబ్బందికి కౌంటింగ్ సిబ్బందికి కొత్తగూడెం రామగుండం మందమర్రి భూపాలపల్లి లలో (రీజియన్ ల వారీగా) శిక్షణ తరగతులు నిర్వహించటం జ‌రిగింది. ఈ శిక్షణా తరగతులను ఆయా జిల్లాలకు సంబందించిన ఆర్.డి.ఒ. స్థాయి అధికారి కేంద్ర కార్మిక శాఖ నుండి రీజినల్ లేబర్ క‌మిష‌న‌ర్‌ (సెంట్రల్), అసిస్టెంట్ లేబర్ క‌మిష‌న‌ర్‌ (సెంట్రల్), అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు, లేబర్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారి (సెంట్రల్) నిర్వహించారు. 27 తేదీన ఎన్నిక‌ల‌ను నిర్వహించేందుకు వీలుగా కేంద్ర కార్మిక శాఖకు సంబంధించిన‌ అధికారులు మొత్తం ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఇక ఆయా జిల్లా కలెక్టర్లు నియమించిన ఆర్.డి.ఒ స్థాయి అధికారులు, తహసీల్దారులు, తగినంత పోలీస్ సిబ్బంది కూడా కంపెనీ వ్యాప్తంగా ఆరు జిల్లాలలో జరుగుచున్న కార్మిక సంఘాల ఎన్నిక‌లు సాఫీగా జ‌రిగేలా చూసేందుకు సంసిద్ధంగా ఉన్నారు. సింగరేణి యాజమాన్యం అంద‌రినీ సమన్వయం చేసుకుంటూ గుర్తింపు ఎన్నిక‌ల నిర్వహణ కోసం అన్ని ఏరియాలలో ఏర్పాట్ల‌ను పూర్తి చేసింది. అన్ని పోలింగ్ కేంద్రాలలో 27న ఉదయం 7 గంటల నుండి ఐదు గంటల వరకు ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సి ఉంది. ప్రతి ఓటరు ఉద్యోగి విధిగా తమ గుర్తింపు కార్డును (ఐడేంటిటీ శాశ్వత తాత్కాలిక) వెంట తీసుకొని ఓటు హక్కు వినియోగించుకోవాలి.
గతంలో 6 దఫాలుగా ఎన్నికలు నిర్వహించిన విధంగానే ఈసారి కూడా శాంతియుత సుహృద్భావ వాతావరణంలో నిర్వహించటానికి గాను కార్మికులు, కార్మిక సంఘాలు, అధికారులు, ప్రభుత్వం పంపిన కేంద్ర కార్మిక శాఖ అధికారులు, రెవెన్యూ, పోలీస్ ప్రెస్ సిబ్బంది అందరూ సహకరించవలసినదిగా యాజమాన్యం విజ్ఞప్తి చేయడం జరిగింది.
పోలింగ్ కేంద్రాలు ఇలా ఉన్నాయి…*
వరుస సంఖ్య ఏరియా పేరు పోలింగ్ కేంద్రాల సంఖ్య ఇలా ఉంది.
కార్పొరేట్ ఏరియా-4, హైదరాబాద్ సింగరేణి భవన్-1 పోలింగ్ కేంద్రాలు, కొత్తగూడెం (రుద్రంపూర్) ఏరియా 06 పోలింగ్ కేంద్రాలు,
ఇల్లందు ఏరియా 03 పోలింగ్ కేంద్రాలు,
మణుగూరు ఏరియా 07 పోలింగ్ కేంద్రాలు,
రామగుండం ఏరియా 1- 11 పోలింగ్ కేంద్రాలు, రామగుండం ఏరియా 2 -06 పోలింగ్ కేంద్రాలు, రామగుండం ఏరియా 3
(అడ్రియాల కలుపుకుని) 06 పోలింగ్ కేంద్రాలు,
భూపాలపల్లి ఏరియా 09 పోలింగ్ కేంద్రాలు,
బెల్లంపల్లి ఏరియా 05 పోలింగ్ కేంద్రాలు,
మందమర్రి ఏరియా 11 పోలింగ్ కేంద్రాలు,
శ్రీరాంపూర్ ఏరియా 15 పోలింగ్ కేంద్రాలు
మొత్తం 84 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you