తెలంగాణ వీణ , మేడారం : మేడారం జాతరకు ఇంకా రెండు నెలల సమయం ఉండగానే భక్తులు అప్పుడే పోటెత్తుతున్నారు కరోనా కేసులు పెరిగితే మళ్లీ రాలేమన్న భయంతో తండోపతండాలుగా తరలివస్తున్నారు. వరుస సెలవులు రావడంతో ఆదివారం ఏకంగా లక్ష మంది వనదేవతలను దర్శించుకున్నారు. సమ్మక్క, సారలమ్మ దేవతలకు పసుపు, కుంకుమ, ఎత్త బెల్లం మొక్కులు చెల్లించుకున్నారు.
అరకొర ఏర్పాట్ల కారణంగా మేడారానికి వచ్చిన భక్తులు ఆదివారం ఇబ్బందులు ఎదుర్కొన్నారు. జాతరకు ఇంకా రెండు నెలల సమయం ఉండటంతో ఇటీవలే ప్రభుత్వం జాతర నిర్వహణకు రూ.75 కోట్లు కేటాయించింది.ఇంకా పనులేవీ మొదలు కాకపోవడంతో సరైన సౌకర్యాలు లేక భక్తులు అవస్థలు పడ్డారు.