- జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక
- ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు
తెలంగాణ వీణ, భద్రాద్రి కొత్తగూడెం : ఐడిఓసి కార్యాలయంలో శనివారం ఘనంగా నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకలల్లో జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల పాల్గొన్నారు. ఐడిఓసి కార్యాలయంలో అన్ని శాఖల అధికారులు, సిబ్బంది సమక్షంలో సెమి క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. సెమీ క్రిస్మస్ వేడుకలకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన కలెక్టర్ కేక్ కట్ చేసి జిల్లా ప్రజలకు క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ క్రీస్తు జన్మించిన రోజును క్రిస్టమస్ పండుగగా ప్రజలు ఎంతో సంతోషంగా ఆనందంగా భక్తిశ్రద్ధలతో వేడుకలు చేసుకుంటారని చెప్పారు. అభివృద్ధిలో మన జిల్లా ఆదర్శవంతంగా నిలవాలని ప్రభువు ఆశీస్సులు ప్రతి కుటుంబంపై సమృద్ధిగా ఉండాలని ప్రత్యేక ప్రార్థనలు చేసినట్లు కలెక్టర్ చెప్పారు. మన జిల్లా అభివృద్ధి పదంలో పయనించాలని ప్రజలు సుఖ శాంతులతో ఆయురారోగ్యాలతో జీవించాలని కలెక్టర్ ఆకాంక్షించారు. ప్రభుత్వం క్రిస్మస్ వేడుకలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. ఆ క్రమంలోనే అన్ని శాఖల జిల్లా అధికారులు సిబ్బందితో నేడు సెమి క్రిస్మస్ వేడుకలు నిర్వహించినట్లు చెప్పారు. ప్రభుత్వ మార్గదర్శకాలు మేరకు జిల్లాలోని ఐదు నియోజకవర్గాలలోని నిరుపేదలకు క్రిస్మస్ బహుమతులు అందచేస్తున్నట్లు చెప్పారు. రానున్న నూతన సంవత్సరంలో లక్ష్యాలను సాధించుటలో సమిష్టి కృషి చేయాలని అర్హులైన పేదల దరికి చేర్చి వారి జీవితాల్లో అభివృద్ధి వెలుగులు నింపాలని చెప్పారు. ప్రతి ఒక్కరు జీసస్ జివితాన్ని ఆదర్శంగా తీసుకుని
శాంతి మార్గంలో నడవాలని చెప్పారు. ఇతరులకు సహాయం సేవ చేసే గుణాన్ని అలవరుచుకొని నవ సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలన్నారు. అనంతరం సిబ్బంది వివిధ శాఖల ఉద్యోగులకు కేక్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు డాక్టర్ రాంబాబు, మధుసూదన్ రాజు, జడ్పి సీఈఓ విద్యాలత, మైనార్టీ సంక్షేమ అధికారి సంజీవరావు, డిఆర్వో రవీంద్రనాధ్, ఎస్సీ అభివృద్ధి అధికారి అనసూర్య, ఉపాధి కల్పనాధికారి విజేత, ఇంటర్మీడియట్ అధికారి సులోచన రాణి, వైద్యాధికారి డాక్టర్ శిరీష, డిసిఓ వెంకటేశ్వర్లు, ఆర్ అండ్ బిఈ భీమ్లా, ఇరిగేషన్ అధికారి అర్జున్ తదితరులు పాల్గొన్నారు.