- ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి ప్రతిక్ జైన్
తెలంగాణ వీణ, భద్రాద్రి కొత్తగూడెం : గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడపబడుతున్న ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 60 ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థిని విద్యార్థులు ఈ గ్రేడ్ సాధించిన పిల్లలను దృష్టిలో పెట్టుకొని అత్యుత్తమ ర్యాంకులతో పాస్ అయ్యే విధంగా ప్రత్యేకంగా స్టడీ మెటీరియల్ రూపొందించడం జరిగిందని ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి ప్రతిక్ జైన్ అన్నారు.
శనివారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాలలో చదువుతున్న 10వ తరగతి విద్యార్థిని, విద్యార్థులకు నిష్ణాతులైన ఉపాధ్యాయులచే రూపొందించిన సబ్జెక్టు టెక్స్ట్ బుక్కులను తన చాంబర్లో ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే పదవ తరగతి పరీక్షలను దృష్టిలో పెట్టుకొని గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలలో, వసతి గృహాలలో చదువుతున్న విద్యార్థిని విద్యార్థుల నైపుణ్యాలను వెలికి తీసి పదవ తరగతిలో అత్యుత్తమ ర్యాంకులతో పాస్ అయ్యే విధంగా ఈ సబ్జెక్టు బుక్కులను రూపొందించడం జరిగిందని సంబంధిత హెచ్ఎంలు వార్డెన్లు తమ పరిధిలోని పాఠశాలల్లో చదువుతున్న పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపి సబ్జెక్టు బుక్కులను చదివే విధంగా కృషి చేయాలని ఏమాత్రం అశ్రద్ధ చేసిన సంబంధిత ఉపాధ్యాయులపై శాఖ పరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన అన్నారు. ముఖ్యంగా ఈ గ్రేడ్ సాధించిన విద్యార్థిని విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అందుకు సంబంధిత డిడి ట్రైబల్ వెల్ఫేర్ అధికారిని ఏసీఎంఓ ఏటీడీవో పర్యవేక్షణ చాలా పగడ్బందీగా ఉండాలని ఏమాత్రం నిర్లక్ష్యం చేసిన పదవ తరగతి పరీక్షలలో గ్రేడ్ పడిపోయే ప్రమాదం ఉందన్నారు. ఇప్పటినుండే స్టడీ అనేది ప్రత్యేక జాగ్రత్తలు తీసుకొని విద్యార్థిని విద్యార్థులకు సబ్జెక్టు టీచర్లు పాఠాలు బోధించాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో డిడి ట్రైబల్ వెల్ఫేర్ అధికారిని మణమ్మ, ఏసీ ఎంవో రమణయ్య, ఏటిడిఓ నర్సింగరావు తదితరులు పాల్గొన్నారు.