భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారిని మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం అందజేసిన మంత్రి దనసరి సీతక్క
సీతక్క గారి సేవల గురించి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు సీతక్కకు చీరను బహుకరించారు…
తెలంగాణ వీణ, ములుగు : భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారిని పంచాయితీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖా మంత్రి దనసరి సీతక్క మర్యాదపూర్వకంగా కలిసి ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి తెలంగాణ రాష్ట్ర, ములుగు జిల్లా, తాడ్వాయి మండలం, మేడారం గ్రామంలో జరుగు సమ్మక్క – సారలమ్మ తల్లుల గిరిజన జాతర ఆసియా ఖండంలోనే జరిగే అతిపెద్ద గిరిజన జాతర అని, అట్టి గిరిజన జాతరకు దేశం నలుమూలల నుండి కోటిన్నరకు పైగా భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటారని, అలాంటి గిరిజన జాతర అయిన మేడారం జాతరకు జాతీయ హోదా కల్పించాలని వినతి పత్రం అందించడం జరిగింది. అలాగే సమ్మక్క – సారలమ్మ తల్లుల ప్రతిమను అందించడం జరిగింది అని అన్నారు. కరోనా సమయంలో సీతక్క గారి సేవలకు గుర్తుగా రాష్ట్రపతి గారికి సీతక్క చీరను బహుకరించారు.