తెలంగాణ వీణ , ఏపీ బ్యూరో : శుక్రవారం రాత్రి టీడీపీ ఎన్నారై నేత యశ్ బొద్దులూరిని సీఐడీ పోలీసులు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అరెస్టు చేయడంపై ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు. యశ్ అక్రమ అరెస్ట్ తనను షాక్‌కు గురిచేసిందని ఖండించారు. ఆంధ్రప్రదేశ్‌లో తప్పుడు కేసులు హైదరాబాద్ విమానాశ్రయంలో అరెస్ట్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది క్రూరమైన ప్రభుత్వమని, అరెస్టులు, నిర్బంధాలతో ప్రశ్నించే గొంతులను అణచివేయాలని చూస్తోందని లోకేశ్ మండిపడ్డారు. ఒక ఉగ్రవాదితో వ్యవహరించినట్టుగా యశ్ బొద్దులూరిని అరెస్ట్ చేసినట్టుగా తెలిసిందని, ఇది భయంకరమని వ్యాఖ్యానించారు. యశ్ బొద్దులూరికి న్యాయం జరిగే వరకు విశ్రమించబోమని, వైఎస్సార్‌సీపీకి చివరి రోజులు దగ్గర పడ్డాయని హెచ్చరించారు. ఈ మేరకు ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. ‘వీ స్టాండ్ విత్ యశ్’ అనే హ్యాష్‌ట్యాగ్‌ను జోడించారు.