తెలంగాణ వీణ, హైదరాబాద్ : సీపీఐ రాష్ట్ర కార్యాలయం మక్దుం భవన్,హిమయాత్ నగర్ హైదరాబాద్ లో తెలంగాణ రాష్ట్ర శాసన సభ్యులు సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్(ఏఐటీయూసీ) అధ్యక్షులు కూనంనేని సాంబశివ రావుని కొత్తగూడెం నియోజక వర్గం నుంచి శాసన సభ కు ఎన్నికైన సందర్బంగా సింగరేణి రిటైడ్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు దండంరాజు రామచందర్ రావు,ఉపాధ్యక్షులు ఆళ వందార్ వేణు మాధవ్, సంయుక్త కార్యదర్శి సామంతుల నర్సింగ్ రావ్,కుంచెబీరయ్య,గీస కనకయ్య బి.కిషన్ ఘనంగా సన్మానించారు.అలాగే సింగరేణి విశ్రాంత ఉద్యోగులు ఎదుర్కుంటున్న సమస్యలను ప్రభుత్వాలకు, సింగరేణి యాజమాన్య దృష్టికి తెచ్చి ఈ క్రింది సమస్యలను పరిష్కరించాలని వినతి పత్రం సమర్పించారు.
డిమాండ్స్:
1.కోల్ మైన్స్ పెన్షన్-1998 సవరించి కనీస పెన్షన్ 15,000 రూపాయలు చెల్లించాలి.పెన్షన్ పథకం లోని నిబంధన ప్రకారం ప్రతి మూడు సంవత్సరాలకు ఒక సారి సమీక్షించి కరువు భత్యం తో కూడిన పెన్షన్ చెల్లించాలి.
2.రాష్ట్ర ప్రభుత్వం చెల్లించే వృధ్యాప్య పెన్షన్ సింగరేణి విశ్రాంత ఉద్యోగులకు వర్తింప జేయాలి.
3.కాంట్రిబ్యూటరీ పోస్ట్ రిటైర్మెంట్ మెడికల్(సిపిఆర్ యం ఎస్) స్కీం కార్డ్ ద్వారా అపరిమిత వైద్య సౌకర్యాలు కల్పించాలి.
4.హైద్రాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, లాంటి పరిసర ప్రాంతాల్లో నివసించే విశ్రాంత ఉద్యోగులకు ఉచితంగా ఔట్ పేషంట్ వైద్యం కొరకు ప్రత్యేక వైద్య విభాగం ఏర్పాటు చేయాలి.
5.విశ్రాంత ఉద్యోగుల మెడికల్ కార్డ్స్ దేశ వ్యాప్తంగా అపరిమిత వైద్యసేవలు అన్ని హాస్పిటల్ నందు చెల్లుబాటు అయ్యేవిధంగా ఉత్తర్వులు జారీ చేయాలి.
6.సింగరేణి ప్రతి ఏరియాలో విశ్రాంత ఉద్యోగులకు కంపనీ గెస్ట్ హౌజ్ లో వసతి సౌకర్యం కల్పించాలి.
7.వివిధ ఏరియా లో ఖాళీగా ఉన్న క్వాటర్స్ లను విశ్రాంత ఉద్యోగులకు ఇవ్వాలి.
8.స్వంత ఇళ్ళు లేని విశ్రాంత ఉద్యోగులకు ఇళ్ళు నిర్మించి ఇవ్వాలి..
9.సింగరేణి విశ్రాంత ఉద్యోగులకు అన్ని ముఖ్య నగరాల్లో విశ్రాంత భవన్ నిర్మించాలి
10.బీబీ నగర్ లోని ఎయిమ్స్ హాస్పిటల్ నందు మెడికల్ కార్డ్ ద్వారా వైద్య సౌకర్యం కల్పించాలి.
- డిసెంబర్ 23 న జరిగే “సింగరేణి డే” ఉత్సవాలను హైద్రాబాద్ లో నిర్వహిస్తూ విశ్రాంత ఉద్యోగులను ఆహ్వానించాలి.
12.సింగరేణి ఆసుపత్రుల్లో వైద్యం స్వీకరించిన విశ్రాంత ఉద్యోగులకు సిపిఆర్ యం ఎస్ కార్డుల నుంచి నిమ్స్ టారిఫ్ లో 40% రికవరీ నిలుపుదల చేసి ఉచితంగా వైద్యం అందించాలి.
13.వయోధికులకు ఆర్.టి.సి బస్సులలో ఉచిత రవాణా సౌకర్యం కల్పించాలి.