తెలంగాణ వీణ, సినిమా : ప్రపంచవ్యాప్తంగా సలార్ మూవీ విడుదలైంది.. ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన డార్లింగ్ సినిమా బొమ్మ థియేటర్లలో పడటంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేవు. సినిమా విడుదల అవుతుందన్న వారం ముందు నుంచే థియేటర్లను ముస్తాబు చేసి అందంగా తయారు చేస్తూ తెగ హడావిడి చేస్తున్నారు.. ఈ క్రమంలో కొందరు ప్రాణాలను కూడా పోగొట్టుకుంటున్నారు.. తాజాగా ఓ అభిమాని విధ్యుత్ షాక్ గురై ప్రాణాలను వదిలాడు.. ఈ విషాద ఘటన సత్యసాయి జిల్లాల్లో వెలుగుచూసింది.. పట్టణంలోని రంగ థియేటర్ ఎదుట గురువారం ఒక ఇంటిపై ఫ్లెక్సీ కడుతూ హీరో ప్రభాస్ అభిమాని బాలరాజు విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు.. తమ అభిమాన హీరో నటించిన సలార్ శుక్రవారం విడుదలకానుండడంతో అనంతపురం తపోవనానికి చెందిన బాలరాజు.. అతడి స్నేహితులు ఫ్లేక్సీ ఫ్రేమ్ తయారు చేయించి స్వయంగా వారే కడుతుండగా.. ఫ్రేమ్ కు ఉన్న ఇనుప చువ్వ ఇంటిపై ఉన్న కరెంట్ తీగలను తాకడంతో కరెంట్ షాక్కు గురై బాలరాజు అక్కడే ప్రాణాలను కోల్పోగా, మరో వ్యక్తికి తీవ్ర గాయాలు తగిలాయి.. మృతిచెందిన బాలరాజు దుస్తుల వ్యాపారం చేస్తున్నారు. కొంతకాలంగా కనగానపల్లి మండలం మామిళ్లపల్లిలో నివాసం ఉంటున్నాడు. బాలరాజు హీరో ప్రభాస్ వీరాభిమాని. మృతుడికి భార్య శిరీష, ఇద్దరు కుమారులు ఉన్నారు.అతని మరణంతో నగర వ్యాప్తంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.. గత రాత్రి మృతుడి బంధువులు, ప్రభాస్ అభిమానులు నిరసన తెలిపారు. కరెంట్ తీగలు తక్కువ ఎత్తులో ఉండడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని బాలరాజు కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.. పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నారు…