తెలంగాణ వీణ , సినిమా : అర్జున్ రెడ్డి/కబీర్ సింగ్ చిత్రం తర్వాత సందీప్ వంగ నుంచి వచ్చిన ‘యానిమల్’ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. రణబీర్ కపూర్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన యానిమల్ సినిమా వెయ్యి కోట్ల వసూళ్లకు కాస్త దూరంలో ఉంది. హిందీలో రూపొందిన యానిమల్ సినిమాకు పాన్ ఇండియా రేంజ్ లో మంచి రెస్పాన్స్ దక్కింది. మొదటి సినిమా ఏదో గాలి వాటు విజయం అనుకున్న వారికి సందీప్ తన యానిమల్ సినిమా తో గట్టి సమాధానం ఇచ్చాడు. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సందీప్ వంగ చాలా ప్రత్యేకమైన దర్శకుడు అని నిరూపించుకున్నాడు. అంతే కాకుండా ఆయన రాబోయే సినిమాల కోసం మొత్తం దేశంలోని సినీ ప్రేమికులు, సినీ వర్గాల వారు, మీడియా వర్గాల వారు ఎదురు చూసేలా చేశాడు. యానిమల్ సినిమా హ్యాంగోవర్ లోనే ఇంకా ఉన్న సందీప్ వంగ తన తదుపరి సినిమా ప్రభాస్ తో చేయబోతున్న విషయం తెల్సిందే. ప్రభాస్ తో చేయబోతున్న స్పిరిట్ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ ను వచ్చే ఏడాది ద్వితీయార్థం లో మొదలు పెట్టబోతున్నట్లు ప్రకటించాడు. అంటే స్పిరిట్ విడుదలకు కనీసం రెండేళ్ల సమయం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్పిరిట్ మొదలు పెట్టకుండానే అల్లు అర్జున్ తో సందీప్ వంగ కొత్త సినిమా ను ప్రకటించాడు. తాజాగా యానిమల్ ప్రమోషనల్ ఇంటర్వ్యూలో తదుపరి సినిమాల గురించి ప్రశ్నించిన సమయంలో స్పిరిట్ గురించి క్లారిటీ ఇచ్చిన సందీప్ వంగ అల్లు అర్జున్ తో చేయబోతున్న సినిమా గురించి ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.
అల్లు అర్జున్ ‘యానిమల్’ మరీ లేట్ అయ్యేనా…?
