తెలంగాణ వీణ , యాదాద్రి : శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారు ఈ నెల 23న ఉత్తర ద్వార దర్శనమివ్వనున్నారు. వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా శనివారం ఉదయం 6.48 గంటలకు స్వామి వారు ఉత్తర ద్వారం ద్వార వేంచేసి భక్తులకు దర్శనమిస్తారని ఆలయ ఈవో గీత వెల్లడించారు. అదేవిధంగా శనివారం నుంచి ఆరు రోజుల పాటు (డిసెంబర్ 23 నుంచి 28 వరకు) స్వామివారి ఆలయంలో అధ్యయనోత్సవాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ నేపథ్యంలో శ్రీ సుదర్శన నారసింహ హోమం, నిత్య లేదా శాశ్వత కల్యాణం, బ్రహ్మోత్సవాలు, జోడు సేవలు రద్దు చేశామని వెల్లడించారు. ఇక డిసెంబర్ 23న లక్ష పుష్పార్చన, ఆర్జిత నిజాభిషేకం, సహస్రనామార్చన కూడా రద్దుచేశామన్నారు. ప్రధానాలయంతోపాటు అనుబంధ పాతగుట్టలోని శ్రీ స్వామివారి నిత్యకైంకర్య వేళల్లో కూడా మర్పుచేశామన్నారు.