తెలంగాణ వీణ , ఏపీ బ్యూరో : ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఈరోజు పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు పార్టీలకు అతీతంగా ముఖ్య నేతలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా జగన్ కు గ్రీటింగ్స్ తెలియజేశారు. ‘ఏపీ సీఎం శ్రీ జగన్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన ఆయురారోగ్యాలతో, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను’ అని ట్వీట్ చేశారు. ముఖ్యమంత్రికి ఏపీ రాష్ట్ర గవర్నర్ కూడా శుభాకాంక్షలు తెలియజేశారు.