తెలంగాణ వీణ , సినిమా : బిగ్ బాస్ సీజన్ 7లో టాప్ 5లో ప్రియాంక నిలిచింది. మొదటి నుంచి కూడా ఆమె మిగతా సభ్యులకు గట్టి పోటీ ఇస్తూ వచ్చింది. చాలామంది పోటీదారులను తట్టుకుని నిలబడింది. తాజాగా గీతూ రాయల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రియాంక మాట్లాడుతూ .. “హౌస్ లో నాకు నచ్చని విషయాలను చెబుతూ వచ్చాను .. నాకు తప్పు అనిపించింది చెబుతూ వచ్చాను” అని అంది. “అమర్ .. శోభ నాకు ఎప్పటి నుంచో ఫ్రెండ్స్. అందువలన వాళ్లతో కాస్త చనువుగా ఉన్నాను అంతే. నేను ఎవరి నుంచి ఏమీ ఆశించకుండా నా శక్తి మేరకు ఆడాను. విజయానికి చాలా దగ్గరగా వచ్చి ఓడిపోయినప్పుడు మాత్రం బాధపడేదానిని. ఈ సీజన్ లో ఎవరు గెలుస్తారు? అనే విషయంలో చివరి వరకూ మాకు ఒక క్లారిటీ రాలేదు” అని చెప్పింది.