తెలంగాణ వీణ,వరంగల్ :వరంగల్ తూర్పు నియోజకవర్గం కాశీబుగ్గ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఫ్లెక్సీలను చింపిన గుర్తు తెలియని వ్యక్తులు.ఫ్లెక్సీలు చింపిన విషయం కలకలం రేపుతోంది.ఎన్నికల ప్రచారంలో కాశీబుగ్గ నుండి మొదలైన మాటల అలజడి తెలిసిన విషయమే.రాత్రి పూట ఫ్లెక్సీలు చింపిన దుండగుల పైన కఠిన చర్యలు తీసుకోవాలని ఆ దుండగులను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు స్థానిక పోలీసు స్టేషన్ లో పిర్యాదు చేయనున్న కాశీబుగ్గ కాంగ్రెస్ యూత్ నాయకులు బిఅర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే ఓటమిని జీర్నించుకోలేని కొందరు చిల్లర పనులు చేస్తూ ఇలా ఫ్లెక్సీలు చింపడం మమ్మల్ని రెచ్చగొట్టడం సరికాదు అని తెలియచేస్తూ ఫ్లెక్సీలు చింపిన సంఘటన పట్ల తీవ్రంగా కండిస్తున్నాం అని కాంగ్రెస్ యూత్ నాయకులు సిలివేరు రాజు అన్నారు ఈ కార్యక్రమంలో రాకేష్ రెడ్డి అజార్ రాజేష్ నవీన్ విజయ్ తదితరులు పాల్గొన్నారు