Tuesday, December 24, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

2023లో డిజాస్టర్ తో ఎంట్రీ ఇచ్చిన భామలు వీరే..

Must read

తెలంగాణ వీణ , సినిమా : 2023 ఎండింగ్ కి వచ్చేసాం. ఈ సంవత్సరంలో ఎంతోమంది కొత్త వాళ్ళు సినిమా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. కొత్త కొత్త సినిమాలు చేసి తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. అందులో కొందరు ఎవ్వరూ ఊహించని విధంగా సక్సెస్ అందుకున్నారు. మరికొందరు మొదటి సినిమాతోనే భారీ ప్లాప్స్ సొంతం చేసుకున్నారు. ఈ ఏడాది టాలీవుడ్ లో అడుగుపెట్టి మొదటి సినిమాతోనే డిజాస్టర్ అందుకున్న హీరోయిన్స్ లిస్టుని పరిశీలిస్తే.. గాయత్రీ భరద్వాజ్.. రవితేజ హీరోగా వచ్చిన ‘టైగర్ నాగేశ్వరావు’ సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. కానీ ఈ మూవీ అనుకున్నంత సక్సెస్ కాలేదు. సాక్షి వైద్య.. అక్కినేని అఖిల్ సరసన ‘ఏజెంట్’ సినిమాతో టాలీవుడ్ కి హీరోయిన్ గా పరిచయమైన ఈ యంగ్ బ్యూటీ మొదటి సినిమాతోనే డిజాస్టర్ అందుకుంది. ఆ తర్వాత ‘గాండీవ దారి అర్జున’ సినిమాలో నటించి మరో ప్లాప్ ని తన ఖాతాలో వేసుకుంది.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you