తెలంగాణవీణ, మేడ్చల్ : తెలంగాణ రాష్ట్ర నూతన ప్రభుత్వం ప్రవేశ పెట్టిన మహాలక్ష్మి పథకం వల్ల తమ జీవితాలు అగమ్యగోచరంగా తయారయ్యాయని ఆటో డ్రైవర్లు నిరసన వ్యక్తం చేస్తున్నారు.బుధవారం మండలానికి చెందిన ఆటో డ్రైవర్లు 500 ఆటోలతో బిఎంఎస్,బి పి టి ఎం ఎం యూనియన్ ఆధ్వర్యంలో మహాలక్ష్మి పథకం పై మహాధర్న ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు రవాణా సౌకర్యం కల్పించడం ద్వారా రాష్ట్రంలోని ఆటో డ్రైవర్ల బతుకులు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమకు న్యాయం చేసి ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు లేదంటే ప్రతి ఆటో డ్రైవర్ కి నెలకి 30 వేల రూపాయల చొప్పున జీవన భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకుంటే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.