. జేసీబీతో ప్రవేశించి చేట్లు , పైపులను తొలగింపు…
. కొర్టు విచారణలో ఉండగా…
. దర్జాగా దౌర్జన్యం… ఫోలీసులకు ఫిర్యాదు…
. బరితెగిస్తోన్న భూ భకాసురులు…
తెలంగాణవీణ, జగదేవ్ పూర్ : ఏళ్ల తరబడి సాగుచేసుకుని జీవనం సాగిస్తున్న ఓ రైతు భూమిలోకి అక్రమంగా చొరబడి జేసీబీతో చెట్లను, పైపులను ధ్వసం చేసి భయాందోళనకు గురిచేసిన సంఘటన సిద్దిపెట్ జిల్లా. జగదేవ్ పూర్ మండల్ లోచొటుచేసుకుంది. బాధితుడి కధనం మేరకు… నల్ల కిష్టారెడ్డి జగదేవ్ పూర్ మండల పరిధిలోని వట్టిపల్లి గ్రామంలోని సర్వే నెంబరు 283, 286 లో మొత్తం ఎనమిదేకరాల భూమిని సాగుచేసుకని జీవనం సాగిస్తున్నాడు. అయితే సర్వే నెంబరు 286లోని ఆరెకరాల స్థలాన్ని 1987లో కొనుగోలి చేసి వ్యవసాయం చేసుకుంటుండగా ఈ నెల 17తేది ఉదయం భూమి మాదంటూ తూప్రాన్ ప్రాంతానికి చెందిన వట్లోరి సిద్దిరాంరెడ్డి , ప్రేమ్ నగర్ కాలనీ మచ్చబొల్లారం ప్రాంతానికి చెందిన నారాయణరెడ్డిలతో పాటు జగదేవ్ పూర్ కు చెందిన దౌవులపుర్ శ్రీనివాస్ రెడ్డి, పెద్దబాయి శ్రీనివాస్ రెడ్డి , మోహన్ రెడ్డి కృపాల్ రెడ్డి, తిరుపతిరెడ్డి, శ్రీను వారి అనుచరులు తమ భూమిలోకి ప్రవేశించి నానా హాంగామా చేస్తూ టేకుచెట్లను, పైపులను జేసీబీలో తొలగించి భయాందోళనకు గురిచేశారని బాధితుడు కిష్టారెడ్డి జగదేవ్ పూర్ పోలీసులను ఆశ్రయించారు. దరణీలో ఇక్కడి సర్వే నెంబర్లు మారడంతో భూమి మాదేనంటూ దౌర్జన్యం చేస్తున్నారు. ఇదే విషయమై గజ్వేల్ కొర్టులో 120/2023 విచారణలో ఉండగానే భూమి తమమే నంటూ వచ్చి దౌర్జాన్యానికి పాల్పడుతూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారని కిష్టారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. గత నలభై ఏళ్లుగా ఇక్కడే వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న తనకు, తన కుటుంభానికి ప్రాణహానీ ఉందని సదరు వ్యక్తులపైన తగిన చర్యలు తీసుకోవాలని , తనకు రక్షన కల్పించాలని కిష్టారెడ్డి కోరుతున్నాడు. ఈవిషయమై జిల్లా కలెక్టర్ కు, ప్రజాదర్భార్ లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.