Friday, September 20, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

కొత్త కండీషన్లు పెడుతున్న రైతుబిడ్డ!

Must read

తెలంగాణ వీణ , సినిమా : అలా ప్రశాంత్‌ వినయ, విధేయత చాలామందిని కట్టిపడేసింది. పొగడ్తలకు ఉప్పొంగిపోకుండా ఒదిగి ఉండే తీరుకు ప్రేక్షకులు ముచ్చటపడ్డారు, గెలిపించారు. ఇక్కడివరకు అంతా బానే ఉంది.. కానీ తర్వాతే సీన్‌ రివర్స్‌ అయింది. టైటిల్‌ గెలిచిన తర్వాత ప్రశాంత్‌ కాళ్లు భూమి మీద లేవు. గాల్లో తేలుతున్నాడు. షోలోకి వెళ్లడం కోసం యూట్యూబ్‌ ఛానల్స్‌కు ఇంటర్వ్యూలు ఇచ్చి తనకు సపోర్ట్‌ చేయమన్న రైతుబిడ్డ ఇప్పుడు కప్పుతో వచ్చిన తర్వాత యూట్యూబ్‌ యాంకర్లను అస్సలు పట్టించుకోవడం లేదట. అంతే కాదు ఇంటర్వ్యూ అడిగితే కూడా చాలా దురుసుగా చులకన చేసి మాట్లాడుతున్నాడట. ఒక్క ఇంటర్వ్యూ అని అడిగితే.. మీరు మా పొలం దగ్గరకు రండి.. పనులు చేయండి.. వీడియో తీసుకోండి. మీ యూట్యూబ్‌ ఛానల్స్‌ నుంచి రైతులకు ఏమిస్తారో చెప్పుర్రి. ఆ తర్వాతే మీకు ఇంటర్వ్యూలు ఇస్తా అంటూ అతి చేస్తూ మాట్లాడాడు. ఇక మల్లన్నసాగర్‌ ప్రాజెక్ట్‌ వల్ల భూములు కోల్పోయిన దాదాపు 15 గ్రామాల రైతులకు గతంలో ఏమైనా సాయం చేశారా? వారికి అండగా నిలిచారా? అని ఓ యాంకర్‌ అడిగాడు. దీనికి ప్రశాంత్‌ స్పందిస్తూ.. నాకేమైనా సీఎం పదివి ఇచ్చిర్రా? ఏదైనా చేయడానికి! నేను ఒక రైతుబిడ్డను కదా సీఎం చేస్తరా చెప్పుండ్రి.. అందరినీ ఆదుకుంటా.. నేనేమైనా నాయకుడినా? నేనూ ఒక రైతుబిడ్డనే నేనేం చేస్తా అని వెటకారంగా నవ్వుతూ సమాధానమిచ్చాడు

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you