రామప్ప ను పర్యాటక కేంద్రంగా అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తాం
తెలంగాణ వీణ , ములుగు : ములుగు జిల్లా వేంకటాపూర్ మండలం లోని పాలంపేట గ్రామంలో శ్రీ రామప్ప రామలింగేశ్వర దేవాలయంలో కుటుంబ సభ్యుల తో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించిన పంచాయితీ రాజ్ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు శ్రీమతి దనసరి అనసూయ సీతక్క
ఈ సందర్భంగా పూర్ణ కుంభంతో స్వాగతం పలికిన దేవాలయ అర్చకులు అనంతరం సీతక్క మాట్లాడుతూ ఇటీవలే కాలంలో రామప్పకు ప్రపంచ వారసత్వ గుర్తింపు రావడం జరిగిందని కాకతీయులు నిర్మించిన రామప్ప ఈనాటికీ చెక్కు చెదరకుండాఉందని
అపురూప శిల్ప సంపదకు ప్రసిద్ధి. కన్ను ఆర్పకుండా చేసే శిల్పాలు, అరుదైన లేత ఎరుపు రాతి నిర్మాణం.. శాండ్‌బాక్స్ సాంకేతికత, నీటిలో తేలియాడే రాళ్లతో పైకప్పు నిర్మాణం… వంటి ఎన్నో ప్రత్యేకతలు రామప్ప సొంతం అని రామప్ప ను టూరిజం హబ్ గా అభివృద్ధి చేస్తామని కాకతీయ రాజులు గా సమ్మక్క సారలమ్మ పాలనలో రామప్ప లాంటి నిర్మాణాలు జరిగాయి అని
కాకతీయులు ఎక్కడ ఉన్నా టెంపుల్ టౌన్ కు ప్రాధాన్యత ఇచ్చారన్నారు రామప్ప కు యూనొస్కో గుర్తింపుకు కృషి చేసిన ప్రోపెసర్ పాండు రంగ రావు,పాపారావు ల కృషి ఎనలేనిది అని సీతక్క అన్నారు అందరి సహకారంతో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం అని మంత్రి సీతక్క అన్నారు
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఐఎఎస్, ఐటిడిఎ పిఓ అంకిత్ ఐఎఎస్ గారితో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులతో పాటు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర, జిల్లా, బ్లాక్ మండల గ్రామ నాయకులు కార్యకర్తలు అనుబంధ సంఘాల జిల్లా మండల గ్రామ నాయకులు ప్రజా ప్రతినిధులు తదితరులు ఉన్నారు.