సీతక్క గారిని గజమాలతో సత్కరించిన నియోజకవర్గ ప్రజలు…
తెలంగాణ వీణ , ములుగు: ములుగు జిల్లాలోని మహమ్మద్ గౌస్ పల్లి, మల్లంపల్లి, పందికుంట, జాకారం గ్రామాల యందు జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్ గారి ఆద్వర్యంలో సీతక్క గారి విజయోత్సవ ర్యాలీ ఏర్పాటు చేయగా అట్టి విజయోత్సవ ర్యాలీకి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర పంచాయితీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మాత్యులు దనసరి సీతక్క మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టి మొట్ట మొదటగా ములుగు నియోజకవర్గం విచ్చేస్తున్న శుభ సందర్భంగా ఘన స్వాగతం పలికిన నియోజకవర్గ ప్రజలు, అడుగడుగునా బరహ్మరథం పట్టి, గజమాలతో, పూలమాలలతో సత్కరించి, నృత్యాలతో, ఆట పాటలతో అత్యంత కోలాహలంగా భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భముగా సీతక్క మాట్లాడుతూ ములుగు నియోజకవర్గ ప్రజల అభిమానాన్ని నేను ఎప్పుడు మరిచిపోలేను అని, నన్ను అత్యంత మెజారిటీతో గెలిపించి, అత్యున్నత హోదా అందించి మంత్రిని చేసిన ప్రజలందరికి నా ధన్యవాదాలు అని, ములుగు ప్రజలందరికి నేను రుణపడి ఉన్నాను అని, నా మీద అభిమానం నాకు ఆస్తులు అని అన్నారు. ములుగు నియోజక వర్గానికి అభివృద్ధి బాటలో నడిపిస్తా అని అన్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్, రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ నాయకులు ప్రజా ప్రతినిధులు అందరూ పాల్గొన్నారు.