తెలంగాణ వీణ , హైదరాబాద్ : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు ఆ పార్టీలో కీలకంగా ఉన్నారు. ఆయన ఉండేది హైదరాబాద్ లో దాంతో ఇటీవల తెలంగాణాలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఓటేశారు అని ప్రచారం సాగింది. కుటుంబ సమేతంగా నాగబాబు పోలింగ్ బూత్ వద్ద నిలబడిన దృశ్యాలు కూడా సోషల్ మీడియాలో కొందరు వైరల్ చేశారు. సరే నాగబాబు ఓటేయడం తప్పు కాదు. ఒక పౌరునిగా ఆయన బాధ్యత. అయితే రచ్చ ఎందుకు అంటే ఆయన తిరిగి తనకు ఏపీలో ఓటు హక్కు కల్పించాలని ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేసుకున్నారు అని దాంతో వైసీపీ రచ్చ చేస్తోంది. ముందు తెలంగాణాలో ఓటేసి ఏపీకి ఏలా బదిలీ చేసుకుంటారు. ఆయనకు ఓటు హక్కు చేసుకునే అవకాశం ఎలా ఉంటుంది అంటూ వైసీపీ నేతలు గుస్సా అవుతున్నారు.