తెలంగాణవీణ , సిద్దిపేట: సిద్దిపేట జిల్లా చిన్నకొడూర్ మండలం రాముని పట్లలో విషాదం చోటు చేసుకుంది. సిద్దిపేట జిల్లా కలెక్టర్ గన్‌మెన్‌గా విధులు నిర్వహిస్తున్న ఆకుల నరేష్ తుపాకీతో భార్యా, ఇద్దరు పిల్లలను కాల్చి, తాను కూడ కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ కలహాలే ఈ ఘటనకు కారణమని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వివరాల్లోకి వెళ్లితే… ఆకుల నరేష్ ప్రస్తుతం కలెక్టర్ వద్ద పీఎస్ఓగా విధులు నిర్వహిస్తున్నాడు. రోజు వారీగా విధులు నిర్వహించుకుని ఇంటికి వచ్చే సమయంలో 9 mm పిస్తోల్‌తో వచ్చాడు నరేష్. తన కుటుంబ సభ్యులైన భార్య చైతన్య, కుమారుడు రేవంత్, కుమార్తె హిమశ్రీలను ముందుగా పిస్తోల్‌తో కాల్చి, తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా నరేష్‌కు ఇటీవల అప్పుల బాధలు ఎక్కువయ్యాని తెలుస్తోంది. తీసుకున్న డబ్బులు చెల్లించాలంటూ వేధింపులు పెరిగాయి. అప్పుల విషయంలోనే తరుచూ భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ గొడవల కారణంగా ఆవేశంతో తన దగ్గర ఉన్న గన్‌ను తీసుకొని మొదటగా పిల్లలను కాల్చి, తర్వాత భార్యను కాల్చి తాను కాల్చుకున్నాడు . ఇద్దరు పిల్లలు స్కూలుకు వెళ్లగా, వారిని ఇంటికి తీసుకువచ్చి మరీ కాల్చి చంపేశాడు నరేష్. అయితే ఆకుల నరేష్ కి ఆన్‌లైన్ బెట్టింగ్ గేమ్‌లు ఆడే అలవాటు ఉందని తెలుస్తోంది. ఎప్పుడు చూసిన ఆన్‌లైన్ గేమ్స్ ఆడేవాడని, వాటి వల్లే రూ. 25 నుండి 30 లక్షల రూపాయల వరకు అప్పు అయినట్లు సమాచారం. కాగా, ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఘటనా స్థలానికి చేరుకున్న క్లూస్ టీం ఆధారాలను సేకరించారు. ప్రస్తుతం సిద్దిపేట జిల్లా కలెక్టర్ జీవన్ పాటిల్ సెలవులో ఉన్నారు. డిసెంబర్ 14వ తేదీతో వెపన్‌ను తీసుకున్న ఆకుల నరేష్, కలెక్టర్ లీవ్‌లో ఉన్నాడని తెలిసి వెపన్‌తో ఇంటికి వెళ్ళాడని పోలీసులు తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అయితే అప్పుల వాళ్లే ఈ అఘాత్యానికి పాల్పడ్డాడా ? లేక ఇతర కారాణాలేమైనా ఉన్నాయా అనే కొణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నార