తెలంగాణ వీణ , సినిమా : కోలీవుడ్‌లో ఒక ఆసక్తికరమైన ప్రచారం జరుగుతోంది. రష్మిక మందన్నా నటించిన సూపర్ హిట్ మూవీ సీక్వెల్‌లో మలయాళ బ్యూటీ మాళవిక మోహన్ నటించబోతున్నారట! రజనీకాంత్ కథానాయకుడిగా నటించిన పేట చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయమయ్యారు మాళవిక మోహన్. ఆ చిత్రంలో నటుడు శశి కుమార్‌కు భార్యగా నటించి ప్రశంసలు అందుకున్న ఆమె ఆ తర్వాత విజయ్‌కు జంటగా మాస్టర్ చిత్రంలో నటించారు. ధనుష్ సరసన మారన్ చిత్రంలోనూ మెరిశారు.
మలయాళ బ్యూటీకి బంపరాఫర్
ప్రస్తుతం విక్రమ్ జంటగా తంగలాన్ చిత్రంలో నటించిన మాళవిక ఆ చిత్రం విడుదల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పా.రంజిత్ దర్శకత్వంలో స్టూడియో గ్రీన్ పతాకంపై కేఈ జ్ఞానవేల్ నిర్మిస్తున్నారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 26వ తేదీన తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. కాగా నటి మాళవిక మోహన్ ఇంతకుముందు కొన్ని హిందీ, మలయాళం చిత్రాల్లోనూ నటించారు. తాజాగా ఆమె బాలీవుడ్‌లో మరో బంపరాఫర్ చేజిక్కించుకున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది