తెలంగాణ వీణ , సినిమా : తాప్సీ పన్ను సౌత్‌కి దూరమైన కానీ, ఇక్కడ అభిమానులకు దగ్గరగానే ఉంది. సోషల్ మీడియాల్లో నిరంతరం తన అభిమానులతో సంభాషిస్తూనే ఉంది. టాలీవుడ్ కోలీవుడ్ లో ప్రేక్షకుల హృదయాలలో మనస్సులలో బలమైన ముద్ర వేసిన తాప్సీ ఉత్తరాదినా భారీ ఫాలోయింగ్ సంపాదించుకుంది. హసీన్ దిల్‌రూబా, తప్పడ్, పింక్, జుడ్వా 2, బద్లా, మన్మార్జియాన్ సహా మరెన్నో చిత్రాలలో అద్భుతమైన నటనను ప్రదర్శించింది.
తాప్సీ తాజా చిత్రంలో కింగ్ ఖాన్ షారూఖ్ సరసన నటించింది. రాజ్‌కుమార్ హిరాణీ దర్శకత్వం వహించిన డంకీలో కనిపించనుంది. ఈ సినిమా ట్రైలర్ ఇటీవలే విడుదలై చర్చనీయాంశమైంది. ఈ చిత్రంలో బోమన్ ఇరానీ, విక్కీ కౌశల్ తదితరులు నటిస్తున్నారు. నిజానికి ఈ ఏడాదిలో అతిపెద్ద విడుదలలలో డంకీ ఒకటి. జవాన్ -పఠాన్ వంటి చిత్రాల బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత అందరి దృష్టి ఇప్పుడు సూపర్ స్టార్ షారూఖ్ నటించిన మూడవ చిత్రంపై ఉంది. అపజయమెరుగని హిరాణీ ఖాన్‌కి మరో బ్లాక్ బస్టర్ అందిస్తాడని అంతా భావిస్తున్నారు. ఈ సినిమా గురించి చెప్పాలంటే ప్రమోషన్లు అంతంత మాత్రమే. సౌత్ లో భారీగా రిలీజ్ కి వచ్చే ఛాన్స్ లేదని కూడా తెలుస్తోంది. టీజర్, ట్రైలర్, రెండు పాటలను మేకర్స్ ఇప్పటికే విడుదల చేశారు. రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ -జియో స్టూడియోస్ బ్యానర్ సంయుక్తంగా నిర్మించాయి. 21 డిసెంబర్ 2023న ప్రపంచవ్యాప్తంగా థియేటర్‌లలో విడుదల కానుంది. చాలా తక్కువ సమయంలో సినిమాని పూర్తి చేసి రిలీజ్ చేస్తున్న ఘనత హిరాణీకి దక్కుతుంది.