తెలంగాణ వీణ , సినిమా : మెగాకోడలు లావణ్య త్రిపాఠి ప్రతీ ఏడాది కేవలం స్నేహితులతోనే పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకునేది. ఇకపై ప్రతీ ఏడాది మెగా కుటుంబం సమక్షంలో వేడుకలు జరుగుతాయని తెలుస్తోంది. అవును లావణ్య పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా మెగా ఫ్యామిలీ హీరోలంతా లావణ్య వేడుకలకు ఘనంగా నిర్వహించినట్లు తెలుస్తోంది. మెగా అల్లుళ్లు సాయితేజ్..వైష్ణవ్ తేజ్….లావణ్య భర్త వరుణ్ తేజ్ ఈవేడుక సెలబ్రేట్ చేసినట్లు తెలుస్తోంది.
తాజాగా ఇన్ స్టా గ్రామ్ లో సాయితేజ్ విషెస్ తెలియజేస్తూ ఓ ఫోటో పోస్ట్ చేసాడు. అందులో లావణ్య. ..సాయితేజ్..వరుణ్ ఒకరి భుజాలపై ఒకరు చేతులు వేసుకుని తమ మధ్య ఉన్న అన్యోన్యతని చాటి చెప్పారు. నువ్వు చల్లగా ఉండు..మా వరుణ్ బాబు ని చల్లగా చూడు అంటూ సాయితేజ్ విషెస్ తెలిపాడు. ఇక వరుణ్ తేజ్ ప్రియమైన భార్యామణికి తనదైన శైలిలో విష్ చేసాడు. ‘హ్యాపీ బర్త్ డే బేబి’ అంటూ రాసుకొచ్చారు. ‘నువ్వు నా జీవితంలోకి వచ్చి నా ప్రపంచాన్ని ప్రకాశవంతం చేసినందుకు’ ధన్యవాదాలు తెలిపారు. ఇక ఫోటోలో లావణ్య త్రిపాఠి..సాయితేజ్ పార్టీ కోడ్ దుస్తుల్లో కనిపిస్తుండగా..వరుణ్ మాత్రం తెల్ల చొక్కా ధరించాడు. హీరోలిద్దరు ఆర్మీ కటింగ్ హెయిర్ స్టైలో లో కనిపిస్తున్నారు. లావణ్య కెమెరా వైపు చూసి అందంగా నవ్వుతుంటే….హీరోలిద్దరు లావణ్యని సీరియస్ గా చూస్తు కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. అభిమానులు లావణ్యకి విషెస్ తెలియజేస్తున్నారు.