తెలంగాణ వీణ , సినిమా : 2020 సంవత్సరంలో టైమ్స్ వారి 50 మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ జాబితాలో టాప్ 10 లో చోటు దక్కించుకుని అందరి దృష్టిని ఆకర్షించిన ముద్దుగుమ్మ రూహి దిలీప్ సింగ్. 1990 లో జన్మించిన ఈ అమ్మడు ఇండస్ట్రీలో అడుగు పెట్టక ముందు మోడలింగ్ లో రాణించింది. ఎన్నో యాడ్స్ లో నటించి మెప్పించింది.
2012 లో ది వరల్డ్ బిఫోర్ హెర్ అనే ఇంగ్లీష్ సినిమా లో రూహి సింగ్ కనిపించింది. ఆ తర్వాత హిందీ చిత్రం క్యాలెండర్ గర్ల్స్ లో కూడా రూహి నటించింది. ఇక సౌత్ లో తమిళం మరియు తెలుగు లో కూడా ఈమె నటించింది. మంచు విష్ణు హీరోగా నటించిన భారీ బడ్జెట్ చిత్రం మోసగాళ్లు లో రూహి హీరోయిన్ గా నటించింది.