తెలంగాణ వీణ , దేవరకద్ర : దేవరకద్ర మండలంలోని పెద్ద రాజమూర్ గ్రామంలో రాత్రివేళల్లో అక్రమ ఇసుక రవాణా జోరుగా సాగుతోంది. గత వారం రోజులు గా వాగు నుంచి ఇసుకను రాత్రి వేళ ట్రాక్టర్ లతో పంటపొలాలకు తరలించి ఇసుకను టిప్పర్ల సాయంతో దేవరకద్ర పట్టణానికి తరలించి కాసులు సంపాదిస్తున్నారు. అక్రమ ఇసుక రవాణాపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.పెద్దరాజమూర్ గ్రామ వాగు నుంచి అక్రమంగా ఇసుకను తరలించడంతో భూగర్భజలాలు తగ్గిపోతున్నాయాయని దింతో రైతులు సాగుచేసిన పంటలకు సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అక్రమ ఇసుక రవాణా అడ్డుకోవాలని కోరుతున్నారు. పెద్దరాజమూర్ గ్రామం నుంచి శుక్రవారం తెల్లవారుజామున అక్రమంగా టిప్పర్ లో ఇసుక తరలిస్తుండగా స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఎస్.ఐ వెంకటేష్ టిప్పర్ ను పట్టుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్.ఐ తెలిపారు. అక్రమంగా ఇసుకను తరలిస్తే చర్యలు తీసుకుంటామని అన్నారు.