తెలంగాణ వీణ , సినిమా : ప్రముఖ బాలీవుడ్ నటుడు శ్రేయాస్ తల్పాడే గుండె పోటుకు గురయ్యారు. నిన్న సాయంత్రం హార్ట్‌ఎటాక్ రావడంతో ఆయనను ముంబైలోని ఓ ఆసుపత్రిలో చేర్పించారు ఆ రాత్రే శ్రేయాస్‌కు యాంజియోప్లాస్టీ జరిగింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి ఆపరేషన్ విజయవంతంగా జరిగిందని వైద్యులు పేర్కొన్నారు వెల్‌కమ్ టూ ది జంగల్ షూటింగ్ అనంతరం శ్రేయాస్ గుండెపోటుతో కుప్పకూలినట్టు తెలుస్తోంది.