తెలంగాణ వీణ , సినిమా : మరో 15రోజుల్లో 2023 అయిపోతుంది. కొత్త ఆశలు, ఆశయాలతో 2024కు స్వాగతం పలికేందుకు ప్రపంచమంతా సిద్ధమవుతోంది. అయితే సినీ భవిష్యత్ పై కొత్త ఆశలు చిగురించేలా ఎప్పుటికప్పుడు యువ ప్రతిభావంతులు.. సినీ ప్రపంచానికి పరిచయమవుతూనే ఉంటారు. 2023లో కొందరు దర్శకులు తమ సత్తాను చాటుకోగా.. మరికొందరు తమ ఫస్ట్ ప్రయత్నంలో తడబడిానా కావాల్సిన అనుభవాన్ని సంపాదించుకున్నారు. ఒక్కసారి రివైండ్ చేసుకుందాం. హాస్యనటుడిగా అందరీ సుపరచితమైన వేణు.. ఈ ఏడాది అందరినీ ఆశ్చర్యపరిచారు. బలగం సినిమాతో మెగా ఫోన్ పట్టారు. చిన్న సినిమాగా విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ సాధించింది. పెద్ద పెద్ద స్టార్లు లేని ఈ చిత్రం.. మంచి లాభాలతో పాటు వేణుకు గుర్తింపు తెచ్చిపెట్టింది. సహజమైన చిత్రీకరణ, తెలుగు మట్టికథ, భావోద్వేగాలు, మంచి సంగీతం. ఇవన్నీ ఈసినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి. ఇప్పుడు వేణు.. నాని లాంటి టాప్ హీరోలకు కథలను చెప్పే పనిలో బిజీగా ఉన్నారు.