తెలంగాణ వీణ , సినిమా : బిగ్‌బాస్ బుక్ ఆఫ్ మెమొరీస్ చూసుకున్న ప్రశాంత్.. తన తండ్రితో ఉన్న ఫొటో చూసి తెగ ఎమోషనల్ అయిపోయాడు. అనంతరం యాక్టివిటీ రూంలోకి వెళ్లిన ప్రశాంత్.. తన జర్నీని స్క్రీన్‌పై చూసుకుని ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయిపోయాడు. ఇక మొదటి నుంచి కేవలం ప్రశాంత్ అని పిలుస్తూ వచ్చిన బిగ్‌బాస్.. ఫస్ట్ టైమ్ ఇప్పుడు పల్లవి ప్రశాంత్ అని పిలిచాడు. దీంతో మనోడు ఏడుపు కంట్రోల్ చేసుకోలేకపోయాడు. ఓవైపు నవ్వుతూ, మరోవైపు ఏడుస్తూ.. ఆనంద భాష్పలతో షర్ట్ అంతా తడిపేశాడని చెప్పొచ్చు. అలా బుధవారం ఎపిసోడ్ ముగిసింది