తెలంగాణ వీణ , ఏపీ బ్యూరో : ఏపీలో కొన్ని నియోజకవర్గాల్లో మార్పులు, చేర్పులు చేస్తున్నామన్నారు వైఎస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి. ఏపీలో 175 స్థానాల్లో 175 వైఎస్సార్సీపీ గెలవాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లక్ష్యమని తెలిపారు. కాగా, వైవీ సుబ్బారెడ్డి మంగళవారం విశాఖలో మాట్లాడుతూ.. గాజువాకలో సమన్వయకర్తను మార్పు చేయాలని పార్టీ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని రెండు వారాల క్రితమే ఎమ్మెల్యే నాగిరెడ్డికి తెలియజేశాం. మాకు సీటు ఇచ్చినా, ఇవ్వకపోయినా ముఖ్యమంత్రిగా జగన్ కావాలని నాగిరెడ్డి, దేవన్ రెడ్డి చెప్పారు. మంచి అభ్యర్థికి సీటు ఇవ్వమని నాగిరెడ్డి సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్సీపీలో చాలా మార్పులు జరగనున్నాయి. నారా లోకేష్ పాదయాత్ర వల్ల టీడీపీకి ఎటువంటి ఉపయోగం లేదు అంటూ కామెంట్స్ చేశారు.