తెలంగాణ వీణ , సినిమా : రజనీకాంత్ పుట్టినరోజు సందర్భంగా నటుడు ధనుష్ తన ఎక్స్ పేజీలో “హ్యాపీ బర్త్ డే తలైవా” అని రాశారు. అలాగే, రజనీకాంత్ పుట్టినరోజు సందర్భంగా ట్విట్టర్‌లో HBD సూపర్ స్టార్ రజనీకాంత్ అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అయ్యింది. గతంలో జైలర్ సినిమా విడుదలైన సమయంలో కూడా ధనుష్ రియాక్ట్ అయ్యాడు. ఈ వారం అంతా జైలర్‌దే అంటూ ట్వీట్ చేశాడు. ధనుష్ శుభాకాంక్షలను చూసిన అభిమానులు వారి మధ్య ఎన్ని సమస్యలు వచ్చినా రజనీపై ధనుష్ అభిమానం తగ్గలేదని వ్యాఖ్యానిస్తున్నారు.
రజనీకాంత్ 170 వ సినిమా టైటిల్ టీజర్‌ను ఈరోజు సాయంత్రం 5 గంటలకు విడుదల చేయనున్నట్టు వారు ప్రకటించారు. రజనీ పుట్టినరోజు సందర్భంగా తమిళనాడు వ్యాప్తంగా ఆయన అభిమానులు కూ అన్నదానం చేయడం గమనార్హం.