తెలంగాణ వీణ , సినిమా : పాయల్ రాజ్‌పూత్ ప్రధాన పాత్రలో అజయ్ భూపతి తెరకెక్కించిన పాన్ ఇండియా సినిమా ‘మంగళవారం మిస్టీరియస్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా నవంబర్ 17న విడుదలైంది. ‘ఆర్‌ఎక్స్ 100’ లాంటి విజయం తర్వాత హీరోయిన్ పాయల్ రాజ్‌పూత్, డైరెక్టర్ అజయ్ భూపతి కాంబినేషన్‌లో ఈ సినిమా వచ్చింది. స్వాతిరెడ్డి గునుపాటి సురేష్ వర్మ సంయుక్తంగా దీనిని నిర్మించారు నందిత శ్వేత, దివ్య పిళ్లై, అజయ్ ఘోష్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న మంగళవారం చిత్రం ఓటీటీలోకి విడుదల అయ్యేందకు రెడీగా ఉంది. ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 22న మంగళవారం రోజునే ఈ చిత్రాన్ని ఓటీటీలోకి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట. అందుకు సంబంధించిన పోస్టర్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కానీ ఈ చిత్రం ఓటీటీ విడుదల గురించి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.