తెలంగాణ వీణ , హైదరాబాద్ : సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ చీఫ్ చంద్రబాబు పరామర్శించారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై కేటీఆర్, వైద్యులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని చంద్రబాబు ఆకాంక్షించారు.
ఇటీవలే కేసీఆర్‌కు తుంటి ఎముక మార్పిడి శస్త్ర చికిత్స చేశారు వైద్యులు. వాకర్ సాయంతో కేసీఆర్ నడుస్తున్నారు. కేసీఆర్ కోలుకుంటున్నారని వైద్యులు తెలిపారు. ఒకట్రెండు రోజుల్లో కేసీఆర్‌ను డిశ్చార్జ్ చేసే అవకాశం ఉంది. 6 నుంచి 8 వారాల విశ్రాంతి అవసరమని వైద్యులు పేర్కొన్న సంగతి తెలిసిందే.