తెలంగాణ వీణ , హైదరాబాద్ : హైదరాబాదు బండ్లగూడలోని బిర్లా ఓపెన్ మైండ్స్ ఇంటర్నేషనల్ స్కూల్లోకి అయ్యప్ప మాల వేసుకున్న బాలికను అనుమతించకపోవడం తీవ్ర విమర్శలకు దారితీసింది. దీనిపై ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి స్పందించారు.
రాజేంద్రనగర్ పరిధిలోని బండ్లగూడలో ఓ ప్రైవేటు పాఠశాల యాజమాన్యం అయ్యప్ప మాల ధరించిన విద్యార్థినిని అనుమతించకపోవడం తీవ్రంగా కలచివేసిందని తెలిపారు. స్కూలు యూనిఫాంలోనే రావాలని యాజమాన్యం కరాఖండీగా చెప్పడంతో, ఆ బాలిక గంట పాటు ఎండలోనే నిలుచోవాల్సి వచ్చిందని విష్ణువర్ధన్ రెడ్డి వివరించారు.