తెలంగాణ వీణ , హైదరాబాద్ : యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను బీఎస్పీ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, బీమ్ ఆర్మీ అధినేత ఆజాద్ పరామర్శించారు. ఆ తర్వాత మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌ను కలిసి.. ఆరోగ్యం గురించి ఆరా తీశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ… కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని, ప్రజా సమస్యలపై మాట్లాడాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆయన మళ్లీ ప్రజల్లో తిరగాలన్నారు.