Sunday, December 22, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

 వైసీపీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా 

Must read

తెలంగాణ వీణ , ఏపీ బ్యూరో : వైసీపీకి మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి షాకిచ్చారు. ఎమ్మెల్యే పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ఆయన రాజీనామా చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. 2014 నుంచి 2019 వరకు… 2019 నుంచి ఇప్పటి వరకు నీతి నిజాయతీగా ఎమ్మెల్యేగా పని చేశానని… ప్రజా సమస్యలను తీర్చేందుకు కృషి చేశానని ఆయన చెప్పారు. ఈ విషయం ప్రజలందరికీ తెలుసని అన్నారు. తనకు ఎమ్మెల్యేగా పని చేసే అవకాశం కల్పించినందుకు ప్రజలకు ధన్యవాదాలు తెపుతున్నానని చెప్పారు. ఒకవైపు బాధగా ఉన్నప్పటికీ… కఠినమైన నిర్ణయం తీసుకోవాలనిపించి రెండు నిర్ణయాలను తీసుకున్నానని చెప్పారు. ఒకటి మంగళగిరి ఎమ్మెల్యేగా రాజీనామా చేయాలనేది, రెండోది పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయాలనేది అని తెలిపారు. ఈ సందర్భంగా రాజీనామా లేఖను ఆయన మీడియాకు చూపించారు.
రాజీనామా లేఖను స్పీకర్ ఫార్మాట్లో అందజేశానని… తన రాజీనామాను నేరుగా ఇద్దామని స్పీకర్ కార్యాలయానికి వెళ్లాలని… అయితే స్పీకర్ అందుబాటులో లేకపోవడంతో స్పీకర్ ఓఎస్డీకి లేఖను అందజేశానని ఆర్కే తెలిపారు. తన రాజీనామాను అందించాలని కోరానని చెప్పారు. 1995 నుంచి రాజకీయాల్లో అగ్రెసివ్ గా పని చేసుకుంటూ వచ్చానని.. వైఎస్ రాజశేఖరరెడ్డి వద్ద పని చేస్తూ 2004లో సత్తెనపల్లి టికెట్ ఆశించి భంగపడ్డానని, 2009లో పెదకూరపాడు సీటును ఆశించి మళ్లీ భంగపడ్డానని చెప్పారు. అయినప్పటికీ వైఎస్సార్ ను కానీ, కాంగ్రెస్ ను కానీ ఒక్కమాట కూడా అనలేదని తెలిపారు. 

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you