తెలంగాణ వీణ , సినిమా : టాలీవుడ్ ప్రముఖ నటుడు వెంకటేశ్ బెజవాడ దుర్గమ్మను దర్శించుకున్నారు. అనంతరం టిఫిన్ చేసేందుకు బాబాయ్ హోటల్‌కు రావడంతో సందడి నెలకొంది. ఆయనతో సెల్ఫీలు దిగేందుకు జనం పోటెత్తారు. ఫొటోలు తీసుకుని మురిసిపోయారు.
వెంకటేశ్ నటించిన పాన్ ఇండియా మూవీ సైంధవ్ విడుదలకు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ప్రమోషన్స్‌తో బిజీగా ఉంది. అందులో భాగంగా నటుడు వెంకటేశ్‌తోపాటు దర్శకుడు, హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్ తదితరులు ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. సినిమా విజయవంతం కావాలని ప్రార్థించారు.
ఆలయానికి చేరుకున్న చిత్ర బృందానికి ఆలయ అధికారులు స్వాగతం పలికారు. వేదపండితులు ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలు అందించారు. వెంకటేశ్ వస్తున్న విషయం తెలియడంతో అభిమానులు ఆలయానికి చేరుకుని ఆయనను చూసేందుకు ఎగబడ్డారు.