Wednesday, December 25, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

తెలంగాణలో మధ్యాహ్నం 2 గంటల నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం

Must read

తెలంగాణ వీణ , హైదరాబాద్ : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తమ ఆరు గ్యారెంటీలను నెరవేర్చే దిశగా అడుగులు వేస్తోంది. ఈరోజు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ జన్మదినం సందర్భంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అందుబాటులోకి తీసుకొస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ కార్యక్రమం ప్రారంభంకాబోతోంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఆర్డినరీ, ఎక్స్ ప్రెస్ బస్సుల్లో మహిళలు, బాలికలు ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. రాష్ట్ర సరిహద్దుల వరకు ఉచితంగా ప్రయాణించే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది. ఈ పథకం పట్ల మహిళల నుంచి పెద్ద ఎత్తున హర్షం వ్యక్తమవుతోంది.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you