తెలంగాణ వీణ, చేగుంట : చేగుంట మండలం చందాయిపేట్ గ్రామంలో దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి గారి ఆదేశాల మేరకు సన్న బియ్యం పంపిణీ చేసిన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్ వారు మాట్లాడుతూ
ప్రతి పేద వాళ్ళ సైతం పెద్దల మాదిరిగానే సన్న బియ్యం తో అన్నం తినాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో ఆహార భద్రత పథకంలో భాగంగా రేషన్ కార్డు ఉన్న లబ్ధిదారులకు సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించిదని వారు చెప్పడం జరిగింది. ప్రజా పంపిణీ వ్యవస్థలో సన్న బియ్యం పంపిణీ పథకం చారిత్రాత్మక నిర్ణయమన్నారు. ఈ కార్యక్రమం మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మోహన్ నాయక్ యువ నాయకులు సండ్రుగు శ్రీకాంత్ గ్రామ నాయకులు పభ నగేష్ సెట్, దిలర్ మాణిక్య రెడ్డి, నాగరాజు, దండు మహేష్, బజారి రాజు, md యూసుఫ్ దండు సత్తయ్య కార్యకర్తలు మహిళలు లబ్దిదారులకు పాల్గొన్నారు
ప్రతి పేదోడు సన్న బియ్యం తో కడుపు నిండా తినాలనేదే ప్రభుత్వ లక్ష్యం
