తెలంగాణ వీణ, కుత్బుల్లాపూర్ : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కేంద్ర బీజేపీ ప్రభుత్వం పెంచిన వంట గ్యాస్ ధరను వెంటనే ఉపసంహరించుకోవాలి సిపిఎం కుత్బుల్లాపూర్ మండల కార్యదర్శి కీలుకాని లక్ష్మణ్ షాపూర్ నగర్ కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ బండపై రూ 50ని వెంటనే ఉపసంహరించుకోవాలని సిపిఎం మండల కార్యదర్శి కీలుకాని లక్ష్మణ్,మండల కమిటీ సభ్యులు, కామ్రేడ్ బి సత్యం కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈరోజు షాపూర్ రైతుబజార్ నుండి శుభం హోటల్ వరకు నిరసన ర్యాలీ అనంతరం షాపూర్ ప్రధాన రోడ్ పై నిరసన వ్యక్తం చేస్తూ రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్ ధర రూ: 50కి పెంచడం మూలంగా గ్యాస్ ధర రూ:876 నుండి రూ: 905 పెరగడం మూలంగా పేద, మధ్యతరగతి ప్రజలపై తీరని భారం పడుతుంది ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు ఈ దేవదానం డి కరుణాకర్, రావుల స్వాతి , sk కలీల్, జి వెంకన్న, భాష దుర్గనాయక్, యాదవరెడ్డి, నర్సింహులు, గోపి, సాదులు , పలుకొన్నారు.
కేంద్ర బీజేపీ ప్రభుత్వం పెంచిన వంట గ్యాస్ ధరను వెంటనే ఉపసంహరించుకోవాలి – కీలుకాని లక్ష్మణ్
