తెలంగాణ వీణ, ఏపీ బ్యూరో : గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని విజయవాడ పటమట పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ రాయదుర్గంలోని మైహోం భుజాలో పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేసి విజయవాడకు తీసుకెళ్లారు. కిడ్నాప్, దాడి, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో బీఎన్‌ఎస్ సెక్షన్లు 140(1), 308, 351(3), రెడ్‌విత్ 3(5) కింద వంశీపై కేసు నమోదు చేశారు. వైకాపా అధికారంలో ఉండగా గన్నవరం తెదేపా కార్యాలయంపై జరిగిన దాడి కేసులో వంశీ ఏ71గా ఉన్నారు.
వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్
