తెలంగాణ వీణ, జగిత్యాల : అటానమస్ హోదా పొందిన తరువాత మొదటిసారి నిర్వహించిన బిఏ, బీకాం, బీఎస్సీ డిగ్రీ మొదటి సంవత్సరం మొదటి సెమిస్టర్ ఫలితాలను ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల (అటానమస్) జగిత్యాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కె. రామకృష్ణ ఈరోజు శాతవాహన విశ్వవిద్యాలయం పరీక్షల నియంత్రణ అధికారి డా. రంగప్రసాద్ గారి సమక్షంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో కళాశాల ప్రిన్సిపల్ మాట్లాడుతూ, “జగిత్యాల జిల్లాలో అటానమస్ హోదా పొందిన ఏకైక కళాశాలగా ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల.జగిత్యాల ఏర్పడిన తరువాత మొత్తం 242 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 147 మంది ఉత్తీర్ణత సాధించారని, మొత్తంగా కళాశాల ఉత్తీర్ణత శాతం 60.74 % గా ఉందని, బి.ఏ.లో 52.17%, బి.కాం.లో 66.15%, బి.ఎస్సి లైఫ్ సెన్సెస్ లో 64.28% మరియు బి.ఎస్సి ఫిజికల్ సైన్స్ లో 58.33% మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని, పరీక్షల ఫలితాలు కళాశాల వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయన్నారు. ఈ ఫలితాలు జగిత్యాల జిల్లాలోని ఇతర శాతవాహన విశ్వవిద్యాలయం అనుబంధ కళాశాలలు సాధించిన పరీక్షల ఫలితాల కంటే అధికంగా ఉన్నాయని తెలియజేస్తూ, అటానమస్ హోదా వల్ల ఫలితాల్లో కళాశాల గణనీయమైన ప్రగతి సాధించిందని మరియు ఇందుకు కళాశాలలో అన్ని సౌకర్యాలు తక్కువ సమయంలోనే సమకూర్చిన గౌరవ శాసన సభ్యులు డా. సంజయ్ కుమార్ గారికి కృతజ్ఞతలు తెలియ జేశారు. అంతే కాకుండా పరీక్షలను విజయవంతం చేసిన పరీక్షల నియంత్రణ అధికారులు డాక్టర్ టీ. ప్రమోద్ కుమార్, డా. వి. వరప్రసాద్, ఎన్ సంగీత రాణి, వివిధ సబ్జెక్టుల విభాగాధిపతులకు అభినందనలు తెలియజేశారు”. అనంతరం అత్యుత్తమ ఫలితాలు సాధించినందుకుగాను జగిత్యాల ప్రభుత్వ మహిళా అటానమస్ డిగ్రీ కళాశాల విద్యార్థులకు, అధ్యాపకులకు మరియు ప్రిన్సిపాల్ తదితరులకు శాతవాహన విశ్వవిద్యాలయం పరీక్షల నియంత్రణ అధికారి డా. రంగప్రసాద్ అభినందనలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పరీక్షల నియంత్రణ అకాడమిక్ కో-ఆర్డినేటర్ కె. రామచంద్రం, వైస్ ప్రిన్సిపల్ జి. చంద్రయ్య, ఐ.క్యు.ఏ.సి కో-ఆర్డినేటర్ డా. ఎన్. వాసవి, డా.శ్రీలత,టి.యస్. కె.సి. సమన్వయకులు జి.నీరజ, అధ్యాపకులు ఎంఏ రహీమ్, ఎస్ మల్లికార్జున్, డా. జమున తదితరులు పాల్గొన్నారు.
