తెలంగాణ వీణ, డోర్నకల్: డోర్నకల్ మున్సిపాలిటీ పరిపాలనలో చైర్మన్ వాంకుడోత్ వీరన్న తనదైన మార్కు చూపారని నాయకుడు ధారావత్ రవీందర్ తెలియజేశారు.ఆదివారం విలేకరులతో మాట్లాడారు.డోర్నకల్ ప్రజలకు సుపరిచితుడు,ప్రజా సేవకుడు వీరన్న పాలన ప్రజలకు చిరస్థాయిగా నిలిచిపోతుందని అన్నారు. మూడు దశాబ్దాలుగా ప్రజా ఆశీర్వాదంతో పదవులను అలంకరించారని గుర్తు చేశారు.చిన్న పెద్ద తారతమ్యం లేకుండా అందరితో కలిసిపోయే నాయకుడని ఆయన కొనియాడారు.పట్టణ ప్రజలకు ఆయన సేవలు మరువలేనివని అన్నారు. ప్రజాక్షేత్రంలో ఆయన సేవలు మరింత అవసరమన్నారు.